Political News

ఉద్యోగుల‌కు హైకోర్టులో ఊర‌ట‌.. జీతం త‌గ్గించొద్ద‌న్న కోర్టు

ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పీఆర్‌సీతో త‌మ‌కు న‌ష్టం వ‌స్తుంద‌ని.. త‌మ జీతాలు త‌గ్గుతాయ‌ని… ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందించింది. ఉద్యోగుల వేత‌నాల‌ను త‌గ్గించ‌వ‌ద్ద‌ని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచీ రికవరీ చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిపై మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వెయ్యాలని ప్రభుత్వానికి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జీతాల్లో రికవరీ చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. పీఆర్సీపై నియమించిన ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వలేదని న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. జీవోల్లో ఎరియర్స్ కట్ చేయటాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా… ఈ వ్యవహారంలో అనేక అంశాలు ముడిపడి ఉండటంతో ప్రభుత్వం సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది. పీఆర్సీలో జీతాలు తగ్గాయని హైకోర్టులో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, మంత్రుల కమిటీ ముందు కేవలం నాలుగు జేఏసీల అధ్యక్షులు మాట్లాడాలని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. గతంలో పెట్టిన మూడు ప్రతిపాదనలను మరోమారు మంత్రుల కమిటీ ముందు ఉంచాలని నిర్ణయించారు. ఇతర ఆర్థికపరమైన ప్రతిపాదనలు పెడితే మరోసారి స్టీరింగ్ కమిటీలో చర్చించనున్నట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల రిలే దీక్షలకు స్టీరింగ్ కమిటీ సంఘీభావం తెలిపింది. తాజాగా ప్ర‌భుత్వం నుంచి ఉద్యోగ సంఘాల‌కు ఆహ్వానం అందింది. చ‌ర్చ‌ల‌కు రావాల‌ని.. కూర్చుని తేల్చుకుందామ‌ని.. ఆహ్వానం పంపారు.

This post was last modified on February 1, 2022 2:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago