Political News

టీడీపీ ఈ నలుగురునే టార్గెట్ చేస్తోందా ?

జగన్మోహన్ రెడ్డిని బలహీన పరచాలంటే ముందు చుట్టూ ఉన్నవారిని దెబ్బ కొట్టాలి. చుట్టూ ఉన్న వారిలో అత్యంత కీలకమైన వారెవరు ? ఆ నలుగురే  అని బహుశా తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయినట్లుంది. అందుకనే ఎక్కువగా ఈ నలుగురి మీదే బాగా కాన్సంట్రేట్ చేస్తున్నది ప్రధాన ప్రతిపక్షం. ఇంతకీ ఈ నలుగురు ఎవరంటే ముందుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని.

తర్వాత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  మరో ఇద్దరు మంత్రులు.  చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి. కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని.  చంద్రబాబుతో పాటు పార్టీ హోలు మొత్తానికి వీరు కంట్లో నలుసుగా తయారయ్యారు.  చంద్రబాబును మంత్రులిద్దరు డ్యామేజి చేసినట్లు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టీని జిల్లాలో ప్రత్యేకించి కుప్పంలో ఓడించటం ద్వారా చంద్రబాబును పెద్దిరెడ్డి మానసికంగా దెబ్బకొట్టారు.  

ఇక కొడాలేమో వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ద్వారా చంద్రబాబును గుక్కతిప్పుకోనీయటం లేదు. కొడాలి ఓవర్ గా మాట్లాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా మంత్రి తన పంథాను మార్చుకోవటం లేదు. దీంతో మంత్రులిద్దరిపైన చంద్రబాబుతో పాటు యావత్ టీడీపీ మండిపోతోంది. వచ్చే ఎన్నికల్లో వీళ్ళని ఓడగొట్టేందుకు శతవిధాల ప్లాన్ చేస్తోంది. ఇక విజయసాయిరెడ్డేమో ఢిల్లీ స్ధాయిలో వైసీపీకి చాలా కీలకంగా ఉంటున్నారు. నరేంద్ర మోడి, అమిత్ షా-జగన్ ప్రభుత్వానికి మధ్య బ్రిడ్జి లాగ వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీకి కొరకరాని కొయ్యలాగ తయారయ్యారు.  అందుకనే ఈ ఎంపీని కూడా టీడీపీ పదే పదే టార్గెట్ చేస్తోంది.

తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు రూపంలో విజయిసాయిరెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. అలాగే సజ్జలను కూడా టీడీపీ నేతలు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. సకల శాఖల మంత్రి అంటూ  పదే పదే టార్గెట్ చేస్తున్నారు. నిజానికి విజయసాయి, సజ్జల ఎన్నికల్లో ఏమీ పోటీచేయబోవటం లేదు. కాబట్టి వీళ్ళని ఎంత టార్గెట్ చేసినా టీడీపీకి ఏమీ ఉపయోగం ఉండదు.  అయినా సరే టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళపై  తమ్ముళ్ళల్లో ఎంతమంటుందో అర్ధమైపోతోంది. సజ్జల పాత్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే అన్ని శాఖల గురించి ఆయనే వివరణ ఇస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు.  చివరకు మంత్రులు పక్కన ఉన్నపుడు కూడా వారి శాఖల గురించి సజ్జల మాట్లాడటం  అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

This post was last modified on February 1, 2022 10:14 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

2 mins ago

ఎన్టీఆర్ పేరు చెప్పి బాబును టార్గెట్ చేస్తున్న నాని

గుడివాడ‌లో విజ‌యం కోసం నాని నానాపాట్లు ప‌డుతున్నారు. త‌న అనుచ‌రుల ఆగ‌డాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ…

30 mins ago

సుకుమార్ శిష్యులు మహా ఘటికులు

స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…

1 hour ago

మోడీ వ‌స్తున్నారు.. కూట‌మిలో జోష్‌, వైసీపీలో టెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న కూట‌మిలో మ‌రింత జోష్ పెర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే విజ‌యం ఖాయ‌మ‌నే ధీమాతో…

1 hour ago

వ్య‌తిరేక‌త జ‌గ‌న్ మీద కాదు ఎమ్మెల్యేల పైనే అంటా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అధికారం నిల‌బెట్టుకోవ‌డం జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా…

2 hours ago

శింగ‌న‌మ‌ల సింగ‌మ‌లై ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ పార్టీల‌న్నీ ప్ర‌చారంలో దూసుకెళ్తున్నాయి. అభ్య‌ర్థులు…

2 hours ago