యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అయితే అది రియల్ లైఫ్ కాదు.. రీల్ లైఫ్ లో అని తెలుస్తోంది. గతంలో పాలిటిక్స్ ప్రచారాల్లో పాల్గొన్న ఎన్టీఆర్.. ఈ మధ్యాకాలంలో చాలా దూరంగా ఉంటున్నారు. ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి పెద్ద చర్చ నడుస్తున్నా.. ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. మొన్నామధ్య కొడాలి నాని తనపై కామెంట్స్ చేసినా.. ఎన్టీఆర్ పట్టించుకోలేదు.
ఇదంతా చూస్తుంటే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేదనే విషయం క్లియర్ గా తెలుస్తుంది. కానీ రీల్ లైఫ్ రాజకీయాలకు మాత్రం ఓకే చెప్పినట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. ఇందులో ఆయన స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
అదేంటంటే.. కథ ప్రకారం ఎన్టీఆర్ బస్తీలో చదువుకునే ఓ కుర్రాడి పాత్ర పోషిస్తున్నారట. అంతేకాదు.. బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడే పవర్ ఫుల్ రోల్ లో ఆయన దర్శనమివ్వబోతున్నారు. రాజకీయాలు, లంచగొండి రాజకీయనాయకులకు ఓ స్టూడెంట్ ఎదురుతిరిగితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. కొరటాల ఈ లైన్ చెప్పిన వెంటనే ఎన్టీఆర్ ఓకే చెప్పేశారట.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. వచ్చే నెలలో ఈ సినిమాను మొదలుపెడతారని సమాచారం. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నట్లు టాక్. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారు.
This post was last modified on January 29, 2022 8:15 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…