సంక్రాంతి సందర్భంగా గుడివాడలో మూడు రోజులపాటు నిర్వహించిన క్యాసినోలో దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు చేతులు మారినట్లు ప్రచారంలో ఉందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనువిఘా తమని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖరాసి, దర్యాప్తు చేయాల్సిందిగా కోరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సూచించింది. కమిటీ సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్యతో పాటు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ చంద్రబాబుకు నివేదిక అందజేశారు.
‘మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించినట్టు, ఇతర రాష్ట్రాల యువతు లతో అశ్లీల నృత్యాలు చేయించినట్టు, తీన్‌పత్తీ, రోలెట్ తదితర జూదాలు జరిగినట్టు పట్టణమంతా కోడై కూస్తోంది. మంత్రికి సన్నిహితుడైన వైసీపీ నాయకుడు మండలి హనుమంతరావు.. మేం గుడివాడ వెళ్లడాన్ని నిరసిస్తూ క్యాసినో నడుస్తున్నప్పుడు రాకుండా ఇప్పుడొచ్చి ఏం చేస్తున్నారని బూతులు తిట్టారు. క్యాసినో జరిగిందనడానికి ఇదే నిదర్శనం’ అని నివేదిక పేర్కొంది.
‘క్యాసినోలో పాల్గొన్న వ్యక్తులు ఈ నెల 17న విజయవాడ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకు, అక్కడి నుంచి గోవాకు వెళ్లినట్టు ప్యాసింజర్ లిస్టు, వారికి టికెట్లు బుక్ చేసిన వ్యక్తి ఫోన్ నంబరు ద్వారా తెలిసింది’ అంటూ ఆ పేర్లు నివేదికలో ప్రస్తావించారు.
‘కోట్ల డబ్బు చేతులు మారడంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)కి లేఖ రాయాలి. కేంద్ర ఆర్థిక మంత్రి లేదా ఆర్థికశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలి. మద్యం సరఫరాపై ఎస్‌ఈబీకి లేఖ రాయాలి. దర్యాప్తునకు రాష్ట్ర పోలీసులు సుముఖంగా లేనందున కేంద్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తేనే నిజాలు బయట పడతాయి. న్యాయస్థానాలనూ ఆశ్రయించాలి’ అని నివేదికలో పేర్కొన్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత టీడీపీ నేతలు మాట్లాడుతూ క్యాసినో ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
This post was last modified on January 26, 2022 11:18 am
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…