మెల్లి మెల్లిగా సోనూసూద్ కి రాజకీయ వాసనలు వంటబడుతున్నట్లున్నాయి. తొందరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం చెల్లెలి కోసం ప్రచార బాధ్యతలు చూస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్ లోని మోగా నియోజకవర్గంలో సోనూసూద్ చెల్లెలు మాళవికా సూద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె గెలుపుకు సోనూ గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న సోను ఐదేళ్ల తర్వాత తాను పూర్తిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను సమాజ సేవలో నూరుశాతం నిమగ్నమైన విషయాన్ని గుర్తుచేశారు. మరో ఐదేళ్ళు సమాజసేవ చేస్తారట. ఆ తర్వాత డైరెక్టుగా ప్రజాసేవలో దిగుతారట. ప్రజలకు సేవచేసే గుణం తమ కుటుంబ రక్తంలోనే ఉందని సోను చెప్పుకున్నారు.
ప్రస్తుతం మోగా నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న సోను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎక్కడా అడగటం లేదు. కేవలం తన చెల్లెలు మాళవికకు ఓట్లేసి గెలిపించాలని మాత్రమే అడుగుతున్నారు. ఒక వైపేమో చెల్లెలు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లెలుకు ఓట్లేయమని మాత్రం సోను అడగడం లేదు. ఇక్కడే సోనుతో పార్టీకి సమస్య వచ్చింది. సోను దృష్టిలో కాంగ్రెస్ పార్టీ వేరు మాళవిక పోటీ వేరనేమో.
చెల్లెలు గెలుపుకోసం ప్రచారం మొదలుపెట్టిన తర్వాతే సోనుకి కూడా రాజకీయ వాసనలు బాగా పట్టినట్లుంది. ఎందుకంటే రాజకీయమనేది పెద్ద వ్యసనం. జనాలు కొట్టే జేజేలు, వేసే పూలదండలకు అలవాటు పడితే అంతే సంగతులు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్న సోను చెల్లెలు కారణంగా రాజకీయాల్లోకి దిగక తప్పలేదు. దిగిన వ్యక్తి మళ్ళీ మళ్ళీ దిగలేదు. చెల్లెలు కోసం ప్రచారం చేస్తున్న సోనుతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రచారం చేయించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరి చివరకు సోను ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on %s = human-readable time difference 11:42 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…