Political News

ఆ ఎమ్మెల్యే కొత్త ఎత్తు..

చేతికి ఉన్న వేళ్ల‌న్నీ ఒకేలా ఉండ‌నట్టుగా.. వైసీపీలోనూ ఎమ్మెల్యేలు అంద‌రూ ఒకేలా క‌నిపించ‌డం లేదు. కొంద‌రు ప్ర‌భుత్వం ఏం చెబితే దానిని గుడ్డిగా అనుస‌రిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం త‌మ అజెండాను అమ‌లు చేస్తున్నారు. ఇంకొంద‌రు.. అస‌లు ఇవ‌న్నీ ఎందుకులే.. అని వ్యాపారాలు.. వ్య‌వ‌హారాల్లో మునిగిపోయి.. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఒక‌రంటే ఒక‌రికి ఎమ్మెల్యేలు.. గిట్ట‌డం లేదు. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఒక‌రిపై ఒక‌రుపైచేయి సాధిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగుఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు..?  త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ ఏం చేస్తున్నాడు? త‌న‌కు తెలిసే ప‌నులు చేస్తున్నాడా?  లేదా.. త‌న‌పై పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడా? అనే ఆలోచ‌న ఎమ్మెల్యేల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది.

ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. ఎంపీలు స‌హా పొరుగు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేల ఆనుపా నులు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మ‌కు అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను వారు వినియోగించుకుంటున్నా రు. ఈ క్ర‌మంంలో తూర్పు గోదావ‌రి జిల్లా రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా అద్భుత‌మైన ఐడియా వేశారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకీ రాని ఐడియా ఆయ‌న‌కు వ‌చ్చేసింది. దీంతో వెంట‌నే ఆయ‌న ఆచ‌ర‌ణ‌లో కూడా పెట్టేశారు. అదే.. వ‌లంటీర్ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం. త‌న నియోజ‌వ‌క‌ర్గంలో ప్ర‌భుత్వం నియ‌మించిన వ‌లంటీర్ల‌ను ఆయ‌న మ‌చ్చిక చేసుకుంటున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా.. త‌న‌కు క్ష‌ణాల్లో స‌మాచారం అందేలా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకుంటున్నార‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి వ‌లంటీర్‌కు వాస్త‌వానికి 50 ఇళ్ల‌కు ఒక వ‌లంటీర్ ఉన్నారు. సో.. ఇంత మందికీ .. రాజా.. ప‌ర్స‌న‌ల్ ఇన్సూరెన్స్ చేయించారు. వారికి ఏదైనా అయినా.. కుటుంబానికి ర‌క్ష‌గా ఉంటుంద‌ని.. చెబుతూ.. ప్ర‌తి వ‌లంటీర్‌కు రూ.2 ల‌క్ష‌ల మేర‌కు ఇన్సూరెన్స్ చేయించారు.  అది కూడా ఆయ‌న సొంత నిధులు కేటాయించారు. భారీ ఎత్తునే ఖ‌ర్చు పెట్టార‌ట‌.

అయితే.. నాయ‌కులు ఏం చేసినా.. ఊరికేనే చేయ‌రు క‌దా.. ఇదే విష‌యంపై సొంత పార్టీనేత‌లే కూపీ లాగారు. తీరా చూస్తే.. రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు, రాజాకు ప‌చ్చ‌గ‌డ్డి వేసిని భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఎంపీ ఎక్క‌డైనా త‌న‌కు తెలియ‌కుండా రాజ‌కీయాలు చేస్తే.. వెంట‌నే ఉప్పందించేలా.. త‌న ప‌క్షాన అనుకూల  ప్ర‌చారం చేసేలా.. ఖ‌ర్చులేని విధంగా వ‌లంటీర్ల‌ను వాడుకునేందుకు రాజా ఇలా ప్లాన్ చేశార‌ని వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. మొత్తానికి ఈ ఐడియా ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on January 24, 2022 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

39 minutes ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

46 minutes ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

1 hour ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

2 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago