Political News

ఛాలెంజ్ విసిరి.. అడ్డంగా బుక్కైన నాని!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే.. నోటికేది వస్తే అది మాట్లాడితే చెల్లదు. హవా సాగినంత కాలం ఓకే కానీ.. పరిస్థితులు తిరగబడినపుడు సీన్ రివర్సయిపోతుంది. కింద పడ్డా నాదే పైచేయి అడ్డంగా వాదిస్తే అందరిలో అల్లరిపాలు కాక తప్పదు. ఇప్పుడు ఏపీ మంత్రి కొడాలి నాని పరిస్థితి ఇలాగే తయారైనట్లు కనిపిస్తోంది. మూడేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాని ప్రత్యర్థుల మీద ఎలా రెచ్చిపోతున్నారో తెలిసిందే.

ముఖ్యంగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లను తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారాయన. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో సైతం పేర్లు లాగి బూతులు తిట్టడం తెలిసిందే. తమకు ప్రజా బలం ఉందన్న ధీమాతో ఆయన పెట్రేగిపోయేవారు. మాటకు ముందు ఛాలెంజ్‌లు విసిరేవారు. చంద్రబాబు, లోకేష్ వచ్చి తన గుడివాడ నియోజకవర్గంలో నిలబడి గెలవాలంటూ సవాళ్లు విసిరేవారు. ఇలాంటి ఛాలెంజ్‌లు ఎన్నెన్నో.ఐతే ఈ అలవాటుతోనే ఇప్పుడు ఒక అనవసర ఛాలెంజ్ విసిరి అడ్డంగా బుక్కపోయారు నాని.

గుడివాడలో నానికి చెందిన కళ్యాణమండపంలో సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేయడం తెలిసిందే. కానీ అదంతా శుద్ధ అబద్ధమని వాదిస్తున్నారు నాని. ఐతే ఈ విషయాన్ని అలా కొట్టి పారేసి తన పని తన చూసుకుని ఉంటే పోయేది. వైసీపీ నాయకులు ఎక్కువగా చేసేది ఇదే. ఆరోపణలు వస్తే అస్సలు పట్టించుకోనట్లు ఉండిపోతారు. కానీ నాని మాత్రం ఊరుకోకుండా పెద్ద సవాలు విసిరారు. తన కళ్యాణమండపంలో క్యాసినో జరిగినట్లు నిరూపిస్తే పెట్రోలు పోసి తగలబెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానన్నారు.

ఈ కామెంట్‌తో ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సాక్ష్యాలు సేకరించాయి. టీడీపీ వాళ్లే కాదు.. జనసేన వాళ్లు కూడా రంగంలోకి దిగారు. వాళ్లు రిలీజ్ చేసిన ఫొటోలు, వీడియోలకు తోడు.. ఆల్రెడీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫొటోలు, వీడియోలు చూస్తే గుడివాడలో క్యాసినో నిర్వహించడం నిజమే అనిపిస్తోంది. నాని సహచరులు కూడా ఆ వీడియోల్లో కనిపిస్తున్నారు. అలాగే నాని మీద పాడిన ఒక పాట కూడా వైరల్ అవుతోంది.

మొత్తానికి నాని ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినట్లే ఉన్నారు. మొత్తానికి పట్టించుకోకుండా వదిలేయాల్సిన విషయంలో పెద్ద సవాల్ విసిరడం ద్వారా తన కొంపకు తానే నిప్పంటించుకున్నట్లు అయింది. అసలే ప్రజా వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతున్న టైంలో ఈ వ్యవహారం అధికార పార్టీ మెడకు చుట్టుకుని నాని మీద చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తేలా ఉంది. ఈ ఛాలెంజ్ తర్వాత నాని మాటలు చూస్తుంటే ఆయన ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరిపోయిందని, తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అర్థమవుతోంది. మరి తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

This post was last modified on January 24, 2022 8:35 am

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

28 minutes ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

35 minutes ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

3 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

4 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

5 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

7 hours ago