కొడాలి నాని.. తన మాటలతో, విమర్శలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే నాయకుడు. ఏపీ సీఎం జగన్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే నాని రంగంలోకి దిగిపోయి ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేస్తుంటారు. ఇక ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నాని అంటే ఓ కొరుకుడు పడని నేత. విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నాని టార్గెట్ అంతా చంద్రబాబే అనడంలో సందేహం లేదు. తన మాటల దాడితో ఆయన బాబుపై చెలరేగుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో తమకు కొరకరాని కొయ్యగా మారిన నానికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు క్యాసినో రూపంలో మంచి అవకాశం వచ్చిందని టీడీపీ భావిస్తోందని సమాచారం.
సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని తన కె కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో ఏర్పాటు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే నాని రూ.500 కోట్లు సంపాదించారని చెబుతోంది. దీనిపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైంది. క్యాసినో పెట్టారా? లేదో? తెలుసుకోవడానికి టీడీపీ నేతలు కలిసి నిజ నిర్దారణ కమిటీ పేరుతో గుడివాడ వెళ్లడం.. ఉద్రిక్తతల నేపథ్యంలో వాళ్లను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే.
మరోవైపు తాను క్యాసినో ఏర్పాటు చేశానని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని మరీ నిప్పు అంటించుకుంటానని నాని సవాల్ విసిరారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత ధూలిపాళ్ల నరేంద్ర క్యాసినో జరిగినట్లు నిరూపించే సాక్ష్యాల వీడియోలను ప్రదర్శించారు. అవి నాని నిర్వహించిన క్యాసినోవేనని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు నాని తన పదవికి రాజీనామా చేసి పెట్రోల్ పోసుకుంటారా? అని ప్రశ్నించారు.
గుడివాడ నియోజకవర్గంలో నానికి గొప్ప పట్టుంది. తన కమ్మ సామాజిక వర్గం అండగా ఉంది. దీంతో నాని తనకు తలనొప్పిగా మారారన్నది చంద్రబాబు భావన. అందుకే గుడివాడలో నానిని పడగొడితే జిల్లాలో పైచేయి సాధించవచ్చని బాబు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిక నానిని టార్గెట్ చేసేందుకు క్యాసినో వ్యవహారం బాబుకు ఆయుధంగా దొరికింది. అందుకే వెంటనే పార్టీ నాయకులను రంగంలోకి దింపారు. నిజ నిర్ధారణ బృందం అంటూ హడావుడి చేశారు. ఇప్పడు ఇదిగో సాక్ష్యాలు అంటూ వీడియోలు బయటపెట్టారు. మొత్తానికి నానికి చెక్ పెట్టేందుకు దొరికిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బాబు వేగంగా పావులు కదుపుతున్నారన్నది స్పష్టమవుతోంది.
This post was last modified on January 23, 2022 4:56 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…