ఏపీలో ఇప్పుడు ఉద్యోగులు రోడ్డెక్కారు. తమకు పీఆర్సీ మాటన జీతాలుతగ్గించారంటూ.. వారు ఆందోళన బాట పట్టారు. అంతేకాదు.. ప్రబుత్వం ఇచ్చిన చీకటి జీవోను రద్దుచేయాలంటూ.. డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఉద్యోగులు ఈ రేంజ్‌లో రోడ్డెక్కడం అనేది జగన్ మోహన్‌రెడ్డి రెండున్నరేళ్ల కాలంలో ఇదే అని చెప్పాలి. ఎందుకంటే. సీఎంకు భయపడ్డారో.. లేక.. వైసీపీని గతంలో పొగడ్తలతో ముంచెత్తి… సీఎం జగన్‌పైనా.. మెచ్చుకోళ్ల మాటలతో తబ్బిబ్బు చేసిన.. ఉద్యోగులకు ఆ మొహమాటం అడ్డం వచ్చిందే.. ఏదేమైనా.. రాష్ట్రంలో జరిగిన అనేక ఉద్యమాల్లో ఎప్పుడూ..నోరు విప్పలేదు.
ఉదాహరణకు రాష్ట్రంలో ఇప్పటికీ రెండు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకటి.. అమరావతి రైతు ఉద్య మం. రెండు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడి ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం. ఈ రెండు ఉద్యమాలకు రాష్ట్రంలో ఇతర ఉద్యోగులు ఎవరూ కూడా మద్దతివ్వలేదు. కనీసం.. ఉద్యమాలు జరుగుతున్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు. విశాఖ ఉక్కు ఉద్యమం అంటే. పోనీ.. అక్కడికే పరిమితం అనుకున్నా.. రాజధాని రైతులు చేసిన ఉద్యమం మాత్రం వారికి మాత్రమే సొంతం కాదుకదా?! ఇది యావత్ రాష్ట్ర ప్రజానీకానికీ.. యువతకు, రాష్ట్ర భవితకు సంబంధించిన ఉద్యమం కదా!
అయినప్పటికీ. ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాలు కనీస మద్దతు ప్రకటించలేక పోయాయి. రైతులు.. రెండేళ్లు గా ఉద్యమాలు చేస్తున్నారు. నిరసన తెలుపుతున్నారు. పోలీసుల దాష్టీకానికి కూడా కొందరు కేసులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. మహాపాదయాత్ర చేశారు. 400 కకిలోమీటర్ల దూరాన్ని అనేక అడ్డంకులు, నిర్బంధాలు ఎదరించి మరీ.. పాదయాత్రను ముందుకు సాగించారు. అలాంటి సమయంలోనూ ఉద్యోగులు ఒక్కరంటే ఒక్కరు నోరు విప్పలేదు. మేం కూడా మీవెంటే ఉన్నాం! అనే మాటను చెప్పలేక పోయారు. ఇప్పుడు…వారికి కాళ్ల కిందకు నీళ్లు వస్తేనే.. ప్రభుత్వంపై ఉద్యమ బాటపట్టారు.
దీనిని ఎవరూ తప్పుపట్టకపోయినా.. రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమాలకు కూడా ఉద్యోగులు అంతో ఇంతో నోరు విప్పాల్సిన అవసరం ఉందనేది నేటి మాట. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రబుత్వం కూడా..ఏపీలో ఏం జరిగినా.. ఎవరూ మాట్లాడరు.. ఎవరూ రోడ్డెక్కరు అనే ధీమాను ప్రదర్శిస్తున్న ధోరణి కనిపించింది. అందుకే అటు విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం, ఇటు అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వాలు.. తమకు నచ్చినట్టు.. చేస్తున్నాయనే వాదన వినిపించింది.
మరి ఇప్పుడు ఉద్యోగులు పీఆర్సీ కోసం రోడ్డెక్కారు.. ఇది మంచిదే అయినా.. విశాల జనహితం,, రాష్ట్ర శ్రేయస్సు విషయంలోనూ ఇదే దూకుడుఎందుకు ప్రదర్శించలేక పోయారనేది ప్రధాన ప్రశ్న. కనీసం ఇప్పటికైనా.. పోరాడితే పోయేదేమీ లేదు.. అన్నట్టుగా ప్రజల గురించి కూడా ఉద్యోగ సంఘాలు.. నాయకులు, సగటు ఉద్యోగులు ఆలోచిస్తారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on January 21, 2022 1:03 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…