రాజకీయాల్లో ఉన్న నాయకులకు హంగు ఆర్భాటమేకాదు.. కేవలం పదవులు.. అనుభవించడాలే కాదు. ఫ్యూచర్ గురించి కూడా జాగ్రత్త పడిపోతున్నారు. అంటే దీపం ఉండగానే చక్కబెట్టుకోవడం అన్న మాట. ఇప్పుడు ఇలాంటి మాటే అనంతపురం జిల్లాకు చెందిన ఒక కీలక నియోజకవర్గం ఎమ్మెల్యే చుట్టూ వినిపిస్తోంది. ఆయన దాదాపు 500 కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో భూములు కొన్నారంటూ.. కొన్ని రోజుల కిందట.. టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు ఒకరు ఆరోపించారు.
అప్పట్లో ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నా.. తర్వాత.. దీనిపై మరోసారి ఆధారాలతో సహా నిరూపించారు. ఇదిలావుంటే.. అటు తెలంగాణలోనూ.. వైసీపీకి చెందిన ఒక కీలక నాయకుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. భారీ ఎత్తున స్థలాలు కొన్నారనే ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఈ చర్చ మరింత ఊపందుకుంది. ఇది ఆ నోటా.. ఈ నోటా.. తాడేపల్లిలోని కీలక సలహాదారు చెవిలో పడింది.
దీంతో ఆయన డేగకన్ను సారించారు. సదరు నేత ఆర్థిక పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఎలా అక్కడ భూములు కొన్నారు? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై దృష్టి పెట్టారు. నిజానికి వైసీపీలో ఏ నేత అయినా.. రూ.100 కోట్ల రూపాయలకు పైబడి చేస్తే.. ఏ పనినైనా..అధిష్టానం దృష్టికి తీసుకువస్తున్నారు. ఎందుకంటే.. తర్వాత ఏదైనా సమస్య వస్తే.. తాము ఇబ్బంది పడకుండా.. ప్రభుత్వం ఆదుకుంటుందనే ఉద్దేశంతో వారు అలా చేస్తున్నారు.
అయితే.. ఈ నేత మాత్రం ఎవరికీ ఏమీ చెప్పకుండానే హైదరాబాద్‌లో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో రూ.500 కోట్లు పెట్టి బూములు కొనడం.. సంచలనంగా మారింది. ఈయన వెనుక ఎవరైనా ఉన్నారా? లేక.. ఆయనే కొన్నారా? ఒకవేళ కొంటే.. అంత సొమ్ములు ఎక్కడ నుంచి వచ్చాయి.. ఎవరు ఇచ్చారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిందని.. వైసీపీలో చర్చ సాగుతోంది. ఈ విషయంలో ఏదైనా తేడా వస్తే.. ఇబ్బందులు తప్పవని కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 20, 2022 12:17 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…