నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతి పండగను తన అక్క దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లోనే చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన కారంచేడులోని ఆమె నివాసంలోనే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. అయితే ఈ సమయంలో మరో విషయంపై బాలకృష్ణ, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య ప్రధానంగా చర్చ జరిగిందనే టాక్ నడుస్తోంది. వెంకటేశ్వరరావు తనయుడు, బాలకృష్ణ మేనళ్లుడు హితేశ్ రాజకీయ రంగప్రవేశం గురించి వీళ్లు ముఖ్యంగా మాట్లాడుకున్నట్లు సమాచారం. హితేశ్‌ను టీడీపీ నుంచి పోటీ చేయించేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
1980వ దశకంలో ఏపీ రాజకీయాలను దగ్గుబాటి వెంకటేశ్వరరావు శాసించారు. తన మామ స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశం పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు కంటే ముందే పార్టీలో చేరి టీడీపీ యువజన విభాగంలో పని చేశారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలిచి దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తిరుగులేకుండా సాగారు. అయితే చంద్రబాబు చేసిన వంచనతో వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారనే అభిప్రాయాలున్నాయి. తన భార్య పురందేశ్వరీని కూడా ఆయన కాంగ్రెస్‌లో చేర్చారు. అప్పుడామె కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం ఉందనే సంగతి గురించి తెలిసిందే. కానీ ఇప్పుడా దూరం మాయమయేలా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల నందమూరి కుటుంబంలో ఓ వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి ఒకరినొకరు పలకరించుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత వాళ్లిద్దరు కలిసి ఫోటో కూడా దిగారు. దీంతో తన తనయుడు హితేశ్ కోసం తిరిగి టీడీపీలో చేరేందుకు దగ్గుబాటి ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.
అప్పుడే తన కొడుకుని పోటీ చేయించాలని అనుకున్నా.. అమెరికా పౌరసత్వం కారణంగా వీలు కాలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం హితేశ్‌ను ఎన్నికల్లో దించి ఎమ్మెల్యేను చేయాలనే పట్టుదలతో వెంకటేశ్వరరావు ఉన్నట్లు సమాచారం. అవసరమైతే టీడీపీ నుంచి తనయుడిని బరిలోకి దింపాలని చూస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా తన ఇంటికి వచ్చిన బాలకృష్ణతో వెంకటేశ్వరరావు హితేశ్ భవితవ్యం గురించి చర్చించారని టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు కూడా హితేశ్ ఎంట్రీని కాదనే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 19, 2022 6:17 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…