తెలంగాణ రైతులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆలోచన గనుక ఆచరణలోకి వస్తే రైతులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రంగా దేశం మొత్తం మీద తెలంగాణాకి క్రెడిట్ దక్కుతుందేమో. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 47 ఏళ్లు నిండిన ప్రతి చిన్న, సన్నకారు రైతలుకు 2 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కేసీయార్ ఆలోచిస్తున్నారు.
కేసీఆర్ ఆలోచన ప్రకారం ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పెన్షన్ పథకంపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కారణంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. అయితే ఈ పథకంలో అనర్హులకు కూడా బాగానే లబ్ది జరుగుతోంది. రైతులకు పెట్టుబడులు అందించే పేరుతో ఏడాదికి రెండుసార్లు ఆర్థిక సాయం అందుతోంది.
ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి పంటల కాలంలో రైతుబంధును ప్రభుత్వం అందిస్తోంది. రైతుబంధు పథకం ద్వారా గడచిన నాలుగేళ్ళల్లో 64 లక్షల మందికి రు. 50 వేల కోట్లు అందించారు. రైతులు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో ఏడాదికి రు. 3205 కోట్ల ప్రీమియం చెల్లిస్తోంది ప్రభుత్వం.
గడచిన ఏడేళ్ళల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సుమారు రు. 2.71 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రులు చెబుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకునేందుకు రెండుసార్లు వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. ఈ పథకంలో కూడా లక్షలాది మంది రైతులకు లబ్ధి కలిగింది. అలాగే సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులను కూడా నిర్మిస్తోంది. ఇందులో కొన్ని సక్రమం ఉంటే మరికొన్ని అక్రమ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అవుతుందనటంలో సందేహం లేదు. కాబట్టి రైతులకు పెన్షన్ పథకాన్నేదో తొందరగా తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకునే పథకాన్ని డిజైన్ చేస్తున్నారేమో చూడాలి.
This post was last modified on January 13, 2022 12:11 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…