మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ పెట్టడం.. సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం.. అలాగే సెకండ్ షోలు రద్దు చేయడం తెలిసిందే. ఓవైపు తెలంగాణలో ఇలాంటి ఆంక్షలేమీ లేకపోగా.. ఏపీలో మాత్రం థియేటర్లను టార్గెట్ చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా ఆంక్షలు పెడుతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐతే తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమేదీ లేదని తేల్చేశారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని. థియేటర్లపై ఆంక్షలకు సంబంధించి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే సినిమాలు వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. టికెట్ల ధరలు, ఇతర అంశాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సమావేశం అనంతరం పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
కొవిడ్ కేసులు నానాటికి పెరుగుతుండటంతోనే థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ తీసుకొచ్చామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అని నాని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందిగా అనిపిస్తే సినిమాలు వాయిదా వేసుకోవాలని అన్నారు. కొవిడ్ కారణంగానే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలను వాయిదా వేసినపుడు మిగతా సినిమాలకు కూడా అలాగే చేసుకోవచ్చు కదా అని ఆయన అన్నారు. ఇక టికెట్ల ధరలకు సంబంధించి సినిమా వాళ్లు రకరకాల లాజిక్స్ చెబుతున్నారని.. తాము కూడా ఇలాంటి లాజిక్‌లు చెబితే వారికి కష్టంగా అనిపిస్తుందన్నారు నాని.
తాము టికెట్ల ధరల విషయంలో చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయలేదని.. 2013లో జారీ చేసిన జీవో నంబర్ 100తో పోలిస్తే ఎక్కువ ధరలే ఏపీలో అమలవుతున్నాయని ఆయన చెప్పారు. టికెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశాలు నిర్వహిస్తోందని.. ఆ కమిటీతో తనకే సంబంధం లేదని.. సినిమా వాళ్లకు ఏమైనా అభ్యంతరాలుంటే రామ్ గోపాల్ వర్మ లాగే ఆ కమిటీని కలిసి తమ అభిప్రాయాలు చెప్పాలని నాని సూచించారు. ఆ కమిటీ సభ్యులతో హోం సెక్రటరీ చర్చించి టికెట్ల ధరలపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
This post was last modified on January 11, 2022 9:29 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…