రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పంలో మూడోరోజు పర్యటించిన ఆయన.. వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక ఎస్సీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బెదిరింపు రాజకీయాలకు అలవాటు పడిన జగన్.. పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులతో పులివెందుల పంచాయతీ చేశారని ఆరోపించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్సే..ఆఖరి ఛాన్స్ కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్స్‌ను రెండేళ్లు వాయిదా వేసేందుకే.. జగన్ ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచిందని చంద్రబాబు అన్నారు. బెదిరింపు రాజకీయాలకు అలవాటు పడిన జగన్…పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులతో పులివెందుల పంచాయతీ చేశారని ఆరోపించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్సే..ఆఖరి ఛాన్స్ కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు మూడోరోజు విస్తృతంగా పర్యటించారు. కుప్పంలో కొత్తగా నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన.. పనులు త్వరగా పూర్తిచేయాలని స్థానిక నేతలను ఆదేశించారు. అనంతరం రామకుప్పానికి చెందిన దళితులు కుప్పం ఆర్అడ్‌బీ అతిథిగృహం వద్ద చంద్రబాబును కలిశారు. గ్రామంలో..అంబేడ్కర్ విగ్రహ వివాదంపై ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని చంద్రబాబు అన్నారు. ఎస్సీలను చంపేసుకుంటూ పోతే అడిగేవారు లేరనుకున్నారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ఎస్సీ మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారు. ముఖ్యమంత్రి మాత్రం మాస్కు పెట్టుకోరు. ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోము. వారి మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు. రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు అండగా ఉండాల్సిన పోలీసులు విఫలమయ్యారు. ఎస్సీలపై దాడి చేసిన వారిపై చర్యల్లేవు అని బాబు నిప్పులు చెరిగారు.
ఆ తర్వాత గుడిపల్లె మండలం శెట్టిపల్లె వెళ్లిన చంద్రబాబు.. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గుడికొత్తూరులో రోడ్‌షో నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేసిన..రేషన్ బియ్యాన్ని చూపించి నాణ్యత లేని బియ్యాన్ని ప్రజలెలా తింటారని ప్రశ్నించారు. ఉద్యోగులను జగన్ మోసగించారని మండిపడ్డారు. హామీల అమలు గురించి జగన్‌ను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
“ఓటీఎస్ ఎవరూ కట్టొద్దు… పేదలకు అండగా నేను ఉన్నా. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తెదేపాది. ఇవ్వడానికి డబ్బుల్లేక 60 నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సు పెంచారు. జగన్ ప్రకటించింది రివర్స్ పీఆర్సీ“ అని బాబు వ్యాఖ్యానించారు.
అనంతరం సి.బండపల్లిలో అక్రమ క్వారీ తవ్వకాలను చంద్రబాబు పరిశీలించారు. భద్రతపై పోలీసులు వారించినా పట్టించుకోకుండా.. సుమారు 3 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో నడిచి 2 గంటలపాటు అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతిపక్ష నేత నియోజకవర్గంలో.. యథేచ్ఛగా చేస్తున్న మైనింగ్‌ని, వైసీపీ అరాచకాలను ప్రపంచానికి తెలియజేసేందుకే…ఇక్కడికి వచ్చానని చంద్రబాబు తెలిపారు.
This post was last modified on January 9, 2022 3:12 pm
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…