ఏ విషయంలో ఎలాగున్నా ఒక్క విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీని వైసీపీ ఫాలో అవుతోంది. ఇంతకీ ఎందులో అంటే మీడియాను టార్గెట్ చేయటంలో. రెండు ప్రధాన పార్టీలు కలిసి మీడియాను టార్గెట్ చేస్తున్నాయి. ముందు ఈ పని తెలుగుదేశం పార్టీ చేస్తే దాన్ని వైసీపీ ఫాలో అవుతోంది. తాజాగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, ఈనాడు టీవీ, టీవీ 5ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
వైసీపీ కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు పిలవద్దని, పై మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవద్దని మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలకు కొడాలి చెప్పారు. కొన్ని మీడియా సంస్ధలను బ్యాన్ చేసినంత మాత్రాన వాటికొచ్చే నష్టం ఏమీలేదనే చెప్పాలి. అలాగే వాటిని మీడియా సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు పిలిచినంత మాత్రాన వైసీపీకో లేకపోతే ప్రభుత్వానికో వస్తున్న లాభం కూడా ఏమీ లేదనే చెప్పాలి.
ఎందుకంటే పై మీడియా సంస్ధలు ప్రభుత్వం, వైసీపీ వ్యతిరేక లైన్ తీసుకుని అలాగే వ్యవహరిస్తున్నాయి. పాజిటివ్ వార్తలు కూడా కవర్ చేసినా అవకాశం ఉన్నపుడు ప్రభుత్వాన్ని నూరుశాతం నెగిటివ్ యాంగిల్లో మాత్రమే చూపుతున్నాయని వైసీపీ ఆరోపణ రోజూ చూస్తున్నాం. సరే ఏ యాంగిల్లో చూపాలనేది వాటి యాజమాన్యాలిష్టం. ఇదే సమయంలో ప్రభుత్వం+వైసీపీ కూడా పై సంస్ధలపై బ్యాన్ పెట్టే స్వేచ్చుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే ఈ టార్గెట్ చేసే ఈ ధోరణి మొదలైంది. అప్పట్లోనే తర్వాత టెర్ములో టీడీపీ సాక్షి మీడియాను బ్యాన్ చేసింది.
2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సాక్షిపై బ్యాన్ కంటిన్యు అయ్యింది. 2014 తర్వాత ప్రతిపక్షంలో ఉన్నపుడే ఆంధ్రజ్యోతిని వైసీపీ బ్యాన్ చేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాపై బ్యాన్ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే తాజాగా అధికారికంగానే పై మీడియా సంస్ధలపై బ్యాన్ విధిస్తున్నట్లు మంత్రే ప్రకటించారు. నిజానికి ఈ ధోరణి ఇటు మీడియాకు అటు ప్రభుత్వానికి కూడా మంచిదికాదు.
అయితే మీడియా యాజమాన్యాలు తమ పరిధిని దాటిపోవటంతోనే ఈ సమస్య వచ్చిపడింది. వార్తలకు, వ్యాఖ్యలకు మీడియా యాజమాన్యాలు తేడా లేకుండా చేసేశాయి. అదే సమయంలో రాజకీయపార్టీలకు, మీడియా యాజమాన్యాలకు మధ్య ఉన్న గ్యాప్ కూడా చెరిగిపోయింది. దాంతో మీడియా సంస్ధలే రెచ్చిపోయి ప్రతిపక్ష పాత్రను పోషించటం మొదలుపెట్టాయి. దాంతో రెండింటి మద్య రెగ్యులర్ గా ఘర్షణ జరుగుతునే ఉంది. దాని ఫలితమే తాజా బ్యాన్.
This post was last modified on January 7, 2022 10:20 am
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…