Political News

మంత్రి నాని మరిచిన ఒక లాజిక్

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన సమస్యల మీద జనాల దృష్టి నిలవకూడదని, వాళ్లను డైవర్ట్ చేయాలని చూస్తున్నారో ఏమో తెలియదు కానీ.. కొంత కాలంగా అక్కడ సినిమా టికెట్ల ధరల వ్యవహారమే ప్రధాన చర్చనీయాంశంగా ఉంటోంది. చిన్న స్థాయి నాయకుల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఈ అంశం గురించి తెగ స్పందించేస్తున్నారు. ఈ విషయం మీదే ప్రెస్ మీట్లు, టీవీ చర్చల్లో కూడా మంత్రులు పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిశ్రమ తరఫున ఈ అంశాన్ని నెత్తికెత్తుకున్నారు. టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని ఎండగడుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ట్వీట్లు వేస్తున్నారు.

అలాగే టీవీ చర్చలకు సైతం వెళ్తున్నారు. తాజాగా ఆయన ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించారు. వాటికి సరైన సమాధానాలు చెప్పడం వైకాపా వాళ్లకు కష్టంగానే కనిపిస్తోంది.కానీ సినిమా టికెట్ల విషయంలో ముందు నుంచి చాలా చురుగ్గా ఉంటున్న మంత్రి పేర్ని నాని.. వర్మ ప్రశ్నల పరంపరలో అన్నింటికీ సమాధానం ఇవ్వకుండా ఒక వాదనతో ట్విట్టర్లోకి వచ్చారు.

100 రూపాయల ధర ఉన్న టికెట్‌ను రూ.1000, 2000కు అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనామిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది అని ఆయన ప్రశ్నించారు. దీనికి వర్మ డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని తీసుకొచ్చారు. అది టికెట్లు అమ్మేవాడికి, కొనేవాడికి మధ్య అంగీకారం మీద ఆధారపడి ఉంటుందని వాదించారు. ఐతే నిజానికి మంత్రి ఒక చిన్న లాజిక్ మరిచిపోయి మాట్లాడుతున్నారు. 100 రూపాయల టికెట్‌ను వెయ్యికో, రెండు వేలకో అమ్ముతున్నది బ్లాక్‌లో. అది కూడా బెనిఫిట్ షోలకు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. థియేటర్ల మీద నిఘా ఉంచి అధిక ధరలకు టికెట్లు అమ్మకుండా చూడాల్సింది ప్రభుత్వమే. భారీ చిత్రాలు రిలీజైనపుడు పోలీసుల్ని పంపి బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారేమో చూడాలి. కౌంటర్లలోనే పెట్టి ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతుంటే కఠిన చర్యలు చేపట్టాలి.

జనాల్లో కూడా చైతన్యం పెంచాలి. ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు అమ్ముతుంటే ఫిర్యాదు చేయాలని థియేటర్ల ముందు బోర్డులు పెట్టించాలి. అంతే తప్ప ఏదో పెద్ద సినిమాకు డిమాండ్ ఉన్నపుడు ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతున్నారని.. థియేటర్ ఉన్న ప్రాంతాన్ని బట్టి రూ.20, 30, 40, 50కి రేట్లు తగ్గించేయడం ఏం లాజిక్కో అర్థం కాదు. నిజానికి ఇలా తగ్గించాక బ్లాక్ టికెట్ల దందా ఇంకా పెరిగిందన్నది ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదు. థియేటర్ల వాళ్లే టికెట్లు బ్లాక్ చేసి.. వాటిని మళ్లీ అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం రేట్లు తగ్గించాక బ్లాక్‌ టికెట్ల సమస్య మరింత తీవ్రమైన మాట వాస్తవం. ఈ సంగతి గమనించకుండా మొండి వైఖరి, వాదనలతో కాలక్షేపం చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టడం ఎంత వరకు సబబు?

This post was last modified on January 5, 2022 6:15 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago