Political News

పండుగలకు ‘RRR’ శాపం

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ అంటే.. సంక్రాంతినే. ఆ తర్వాత అంత సందడి ఉండేది దసరాకే. ఈ రెండు పండగలనూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కిల్ చేసి పడేసిందంటూ ఇప్పుడు సినీ ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పోయినేడాది దసరాకే ‘ఆర్ఆర్ఆర్’ రావాల్సింది. అక్టోబరు 13కు రిలీజ్ డేట్ ఇచ్చి అప్పటికి సినిమాను సిద్ధం చేయడానికి చూశారు. చాలా ముందుగానే డేట్ ఇవ్వడంతో వివిధ భాషల్లో పేరున్న సినిమాలన్నింటినీ దసరా నుంచి దూరం పెట్టారు.

కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టినా సరే.. దసరాకే తమ చిత్రం రాబోతోందని నొక్కి వక్కాణించింది చిత్ర బృందం. దీంతో దసరాకు అనుకున్న ఆచార్య, అఖండ లాంటి సినిమాలను వాయిదా వేసుకున్నారు. మరే పెద్ద సినిమా కూడా ఆ సీజన్లో రాలేదు. చివరికి చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ దసరా నుంచి వాయిదా పడింది. దీంతో మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి లాంటి మీడియం రేంజ్ సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

దసరా టైంలో పెద్ద సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఐతే దసరా పోయినా సంక్రాంతి ఉందిలే అనుకుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ పుణ్యమా అని అది కూడా కళ తప్పే పరిస్థితి వచ్చింది. సంక్రాంతికి ఎన్నడూ లేనంత డల్లుగా మారేలా కనిపిస్తోంది టాలీవుడ్ బాక్సాఫీస్. ‘బంగార్రాజు’ మినహా క్రేజీ సినిమా ఏదీ ఈ పండక్కి రావట్లేదు. రౌడీ బాయ్స్, హీరో, డీజే టిల్లు, 7 డేస్ 6 నైట్స్ లాంటి చిన్న సినిమాలను సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చారు. పండక్కి ఇలాంటి చిన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు.

వీటి రిలీజ్ డేట్లు వరుసబెట్టి ప్రకటిస్తుంటే నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ కళ తప్పుతోందని బాధ పడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ కోసమని భీమ్లా నాయక్, సర్కారు వారి పాట లాంటి క్రేజీ చిత్రాలను వాయిదా వేయించారని.. ఇప్పుడా సినిమా కూడా రేసు నుంచి తప్పుకోవడంతో పండుగ సందడి కనిపించేలా లేదని.. వరుసగా దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండుగల సీజన్లను ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బ కొట్టిందని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ తమ చేతుల్లో లేని దానికి ‘ఆర్ఆర్ఆర్’ టీం మాత్రం ఏం చేస్తుంది పాపం.

This post was last modified on January 2, 2022 2:10 pm

Share

Recent Posts

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

1 hour ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

1 hour ago

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

2 hours ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

2 hours ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

3 hours ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

3 hours ago