Political News

చంద్రబాబు ముందు జాగ్రత్త?

చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. ఈ నెలలో మూడు రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. 6,7,8 తేదీల్లో కుప్పంలోని నేతలు, కార్యకర్తలతో పాటు జనాలను కూడా కలవబోతున్నారు. కుప్పంలో ఒకరోజు మిగిలిన మండలాల్లో రెండు రోజులు పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారట. గడచిన మూడు నెలల్లో నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించటం ఇది మూడోసారి.

అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ముందు జాగ్రత్తపడుతున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళలో చంద్రబాబు మహా అయితే ఓ నాలుగుసార్లు నియోజకవర్గంలో  పర్యటించుంటారు. చంద్రబాబు తరపున నియోజకవర్గంలో వ్యవహారాలను చక్కబెట్టేందుకు పీఏ మనోహర్+మరో నలుగురు నేతలున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏపని అవసరమైనా వీళ్ళని కలవాల్సిందే.

ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా మనోహర్ అండ్ కో దయ మీద ఆధారపడాల్సిందే. ఒకవేళ ఎవరైనా హైదరాబాదో లేకపోతే అమరావతికో వచ్చినా చంద్రబాబును కలవటం అయ్యేపని కాదు. దాంతో  పీఏ అండ్ కో ఓవర్ యాక్షన్ పెరిగిపోయింది. దీని ఫలితమే 2019 ఎన్నికల్లో స్పష్టగా కనబడింది. మొదటిరెండు రౌండ్లు చంద్రబాబు 8 వేల ఓట్ల వెనకబడిపోవటం నేతల ఓవర్ యాక్షన్ ఫలితమే. చివరకు చంద్రబాబు గెలిచినా  పార్టీ  ఓడిపోయింది.

దాంతో చంద్రబాబు నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో కరోనా ఎఫెక్టు కూడా తోడవ్వటంతో బాగా గ్యాప్ వచ్చేసింది. దీని ఫలితం స్ధానిక సంస్ధల ఎన్నికలపైన బాగా పడింది. దాంతో చంద్రబాబు వెంటనే మేల్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలివాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దాంతో పీఏ అండ్ కో మీద ఆధారపడితే లాభం లేదని అర్ధమైనట్లుంది. అందుకనే అప్పటి నుండి నెలకోసారి కుప్పంలో పర్యటిస్తున్నారు.

కుప్పంలోని పార్టీ క్యాడర్ తో బాగా గ్యాప్ వచ్చేసిన విషయాన్ని చంద్రబాబు బాగా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఇలాగే కంటిన్యు అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం కష్టమని అర్ధమైనట్లుంది. అందుకనే అందరినీ అమరావతికి పిలిపించుకుని సమీక్షించారు. ఇపుడు మూడు రోజుల పర్యటన పెట్టుకున్నారు. ఇప్పటికైనా రెగ్యులర్ గా చంద్రబాబు పర్యటిస్తూ అందరితోను టచ్ లో ఉంటే  ఉపయోగం ఉంటుంది. లేకపోతే చంద్రబాబు పొలిటికల్ క్లైమ్యాక్స్ విషాదంగా ముగిసే ప్రమాదముంది.

This post was last modified on January 2, 2022 12:46 pm

Share

Recent Posts

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

10 minutes ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

38 minutes ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

49 minutes ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

2 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

2 hours ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

4 hours ago