ఎన్నిచర్చలు జరిగినా, ఎన్నిసార్లు బేటీలు జరిగినా ఆ ఒక్కటి మాత్రం ఉద్యోగసఘాల నేతలకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయటంలేదు. ఇంతకీ ప్రభుత్వం బయటకు చెప్పని ఆ ఒక్కటి ఏమిటయ్యా అంటే ఫిట్మెంట్. మొదటినుండి పీఆర్సీ ప్రకటన అంశం ఫిట్మెంట్ దగ్గరే పీటముడి పడుంది. ప్రభుత్వమేమో ఫిట్మెంట్ ను 14.29 శాతంగా గట్టిగా పట్టుబట్టుంది. దీనికి ఉద్యోగసంఘాల నేతలు ఎంతమాత్రం అంగీకరించటంలేదు.
నేతలేమో ఫిట్మెంట్ ను 50 శాతం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. ఈ రెండు ఫిట్మెంట్ శాతాల దగ్గర చాలా తేడా ఉంది. మామూలుగా అయితే ఇంత తేడా ఉండదు. కానీ ఇఫుడు ఏకంగా 36 శాతం తేడా కనబడుతోంది. ఉద్యోగసంఘాల నేతలు ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం 14.29 శాతం దాటి వచ్చేట్లు కనబడటంలేదు. అలాగే ఉద్యోగసంఘాల నేతలు కూడా తమ డిమాండ్ మీదే పట్టుబట్టి కూర్చున్నారు.
చివరకు గురువారం జరిగిన సమావేశంలో కూడా అసలు ఫిట్మెంట్ ఎంతిద్దామని ప్రభుత్వం అనుకుంటోందో రెండో ఫిగర్ చెప్పమని నేతలు నేరుగానే ప్రశ్నించారు. అయితే ఎలాంటి ఫిగర్ చెప్పకుండానే ఉన్నతాధికారులు సమావేశాన్ని ముగించేశారు. ఇపుడు జరుగుతున్నది చూస్తుంటే ఫిట్మెంట్ మహాఅయితే 20 శాతంకన్నా మించేట్లు లేదు. దీనికి ఆర్ధికపరిస్దితిని కారణంగా ఉన్నతాధికారులు కారణంగా చూపిస్తున్నారు.
ఒకవైపేమో నేతలు జగన్మోహన్ రెడ్డితోనే భేటీ ఏర్పాటు చేయమని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అదేమో సాధ్యం కావటంలేదు. నిజానికి ఈ విషయాన్ని తెగేదాక లాగటం ప్రభుత్వానికి ఏమాత్రం మంచిదికాదు. వేరేదారి లేక ప్రభుత్వం చెప్పినట్లు ఉద్యోగసంఘాల నేతలు అంగీకరించినా రేపు సమయం వచ్చినపుడు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకం చేసే ప్రమాదముంది.
గతంలో ప్రభుత్వాలు ఉద్యోగసంఘాల నేతలు చెప్పినట్లు విన్నమాట వాస్తవం. అయితే అప్పటి రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి వేరని గుర్తుంచుకోవాలి. పరిస్ధితులు ఏవైనా తమ డిమాండ్లు నెరవేర్చుకోవటమే నేతలకు ప్రధానంగా ఉంటుంది. ఇందుకనే వారితో ఘర్షణాత్మక వైఖరితో కాకుండా వారిని కన్వీన్స్ చేసేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది. అంతిమంగా ఉద్యోగుల సహకారం లేకుండా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేయలేందు. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పీఆర్సీని వివాదాన్ని ముగించటం అందరికీ మంచిది.
This post was last modified on December 31, 2021 11:19 am
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…