తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు కాంగ్రెస్ శాయాశక్తుల ప్రయత్నిస్తోంది. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతోంది. ఉమ్మడి ఏపీలో అధికారం చలాయించిన ఆ పార్టీ.. ఇప్పుడు తెలంగాణలో మునుపటి వైభవం దిశగా అడుగులు వేయాలనే పట్టుదలతో ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు పెంచింది. సభలు, ధర్నాలు, నిరసనలు, ఆందోళనలంటూ కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ విరుచుకుపడుతున్నారు. దీంతో పార్టీలోని తిరిగి జోష్ కనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగించి వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని రేవంత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
దానిపై దృష్టి..
తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశంలోనూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే మాట చెప్పడంతో ముందస్తు ఎన్నికలపై ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. గతంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లినపుడు జరిగిన పొరపాట్లను మరోసారి చేయకుండా హస్తం పార్టీ జాగ్రత్త పడుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే ముందే ఆయన ఎన్నికల్లో సీట్లపై లెక్కలేసుకుంటున్నారని సమాచారం.
ఆ సీట్లు గెలిస్తే..
తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే ఏ పార్టీకైనా 60 అసెంబ్లీ సీట్లు కావాలి. కానీ రేవంత్ మాత్రం 40 సీట్లు గెలిస్తే చాలు అధికారంలోకి రావొచ్చని లెక్కలేసుకుంటున్నారని తెలిసింది. అయితే అందుకో కారణం ఉంది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి ఈ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎలాగో విజయాలు సాధిస్తారని రేవంత్ ధీమాతో ఉన్నారని టాక్. జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా లాంటి సీనియర్ నేతలు ఈ సారి కచ్చితంగా గెలుస్తారని పార్టీ భావిస్తోంది. అందుకు అదనంగా మరో 40 సీట్లు గెలిస్తే అధికారం తమదే అవుతుందని పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఆ దిశగా రేవంత్ ముందుకు సాగుతున్నారని సమాచారం.
ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే ఏయే అంశాల దోహదం చేస్తాయనే విషయంపై రేవంత్ సర్వేలు కూడా చేయించారని తెలిసింది. ఈ సర్వే ఫలితాల ఆధారంగానే గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఓ వైపు తనపై పార్టీలోని సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నప్పటికీ రేవంత్ మాత్రం తనదైన దూకుడుతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
This post was last modified on December 30, 2021 4:31 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…