ఆంధ్రప్రదేశ్‌లో ఇంకే సమస్యా లేనట్లు సినిమా టికెట్లు, థియేటర్ల వ్యవహారాన్ని నెత్తికెత్తుకుంది అక్కడి యంత్రాంగం. ఉన్నతాధికారులు థియేటర్ల మీద దాడులు చేస్తుంటే.. మంత్రులు టికెట్ల ధరల అంశం మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎవరు కాస్త నోరు విప్పినా.. వారిని గట్టిగా కౌంటర్ చేస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రుల టార్గెట్‌గా మారాడు నేచురల్ స్టార్ నాని. టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ అతను చేసిన వ్యాఖ్యలపై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని ఒకరి తర్వాత ఒకరు కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే.
వీరిలో పేర్ని నాని టికెట్ల ధరల దగ్గర ఆగకుండా హీరోల రెమ్యూనరేషన్లు, సినిమాల బడ్జెట్ల మీద పరిధిని దాటే వ్యాఖ్యలు చేశారు. హీరోల పారితోషకాలు తగ్గించాలంటూ పరోక్షంగా తమ రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్‌ను ఆయన లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించింది.
ఇదిలా ఉంటే సినిమాలకు సంబంధించి విషయాల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడాను వివరించే ప్రయత్నం చేశారాయన. తాము అందరినీ ఒకేలా చూస్తామని, తెలుగుదేశం ప్రభుత్వంలా కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణ చెబుతూ.. చంద్రబాబు తన బామ్మర్ది సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిందంటూ పన్ను మినహాయింపు ఇచ్చారని.. కానీ అలాంటి చారిత్రక కథతోనే రూపొందిన చిరంజీవి సినిమా ‘సైరా’కు మాత్రం ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వలేదని.. తమ ప్రభుత్వంలో అలాంటి తేడాలు ఉండవని, అందరినీ ఒకేలా చూస్తామని అన్నారాయన. ఈ మాట విని విస్తుబోవడం జనాల వంతైంది.
‘సైరా’ సినిమా రిలీజైంది 2019లో. అప్పుడు అధికారంలో ఉన్నది జగన్ సర్కారే. అసలు దీనికి పన్ను మినహాయింపివ్వాలని ‘సైరా’ టీం కోరిందో లేదో తెలియదు. ఒక వేళ అడిగి లేదనిపించుకున్నా.. ఆ నింద ప్రస్తుత ప్రభుత్వంపై పడుతుంది కానీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే విడ్డూరం. నిజానికి ఈ పన్ను మినహాయింపు విషయంలో రచ్చ జరిగింది ‘రుద్రమదేవి’ మూవీకి. ‘శాతకర్ణి’కి మినహాయింపు ఇచ్చి తమ సినిమాకు ఇవ్వలేదని గుణశేఖర్ నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే అప్పట్లో తెలంగాణ విభజన నేపథ్యంలో సెంటిమెంట్ బాగా ఉన్న ఆరోజుల్లో ఓరుగల్లును ఏలిన రుద్రమదేవి కథ కావడం తెలంగాణ ప్రాంత చారిత్రక నేపథ్య సినిమా కావడం వల్ల తెలంగాణ సర్కారు దానికి మినహాయింపు ఇచ్చింది.
This post was last modified on December 29, 2021 11:16 am
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం…
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…