టీడీపీ యువనాయకుడు.. మాజీ మంత్రి లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. శపథం.. పార్టీలో బాగానే వర్క వు ట్ అయిందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికిఎన్నారైలు ఇచ్చిన సలహాలు.. సూచనలు బాగానే పా టిస్తున్నారని చెబుతున్నారు. `నాతల్లిని దూషించిన వారిని ఎవరినీ వదిలిపెట్టను!` అని లోకేష్ కామెంట్ చేశారు. దీనిని కామెంట్ అన్నా.. శపథం అన్నా.. ఏదైనా కూడా.. పార్టీలో మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి నవంబరు 19న అసెంబ్లీలో జరిగిన రగడపై దాదాపు నెల రోజుల తర్వాత.. లోకేష్ స్పందించడం పార్టీలో చర్చకు కూడా దారితీసింది.
ప్రస్తుతం లోకేష్ చేసిన శపథంపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు.. లోకేష్‌శపథాన్ని స్వాగతి స్తున్నారు. మరికొందరు ఇప్పుడా.. స్పందించేది..అని పెదవివిరుస్తున్నారు. అయితే.. లోకేష్ చేసిన ఈ శపథం ఏమేరకు పార్టీకిప్రయోజనం కలిగిస్తుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకు లోకేష్ కంటూ.. ఒక ఓటు బ్యాంకు లేదు. పార్టీఓటు బ్యాంకే..తనకు ఓటు బ్యాంకుగా మారుతూ వచ్చింది.
అయితే.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వ్యక్తిగత ఓటు బ్యాంకును పెంచుకోవాలంటూ.. లోకేష్‌కు సూచనలు సలహాలు వస్తున్నా యి. ఇదిలాఉంటే.. పార్టీతో సంబంధం లేకుండా.. వ్యక్తిగత ఓటు బ్యాంకు పెంచుకుంటే.. మంచిదని.. ఆయన కూడా యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో హాట్ కామెంట్లు చేస్తూ.. లైమ్‌లైట్‌లో నిలుస్తున్నారు. తాజాగా చేసిన శపథం కూడా ఇదే కోవలోకి వస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.
లోకేష్‌కు వ్యక్తిగత ఓటు బ్యాంకు అంటే.. యువతే. యువతకు కావాల్సింది ఇలాంటి కామెంట్లేనని.. హాట్ టాపిక్ ఉంటే తప్ప.. యువత ఫాలో కావడం లేదని.. చెబుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ దాదాపు నెల రోజుల తర్వాత ఈ విషయంపై స్పందించారని అంటున్నారు. మరి ఇది.. ఏమేరకు.. వర్కువుట్ అవుతుందనే వేచి చూడాల్సిన అంశం. ఇప్పటికిప్పుడు మాత్రం మంచి సబ్జెక్ట్.. మంచి కామెంటు అనే మాట అయితే వస్తోంది. కానీ, ఇది ఫ్యూచర్ వరకు నిలుస్తుందా? ఇక్కడ నుంచి ఆయన ఎలా ముందుకు సాగుతారు? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.
This post was last modified on December 24, 2021 11:57 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…