ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఒక విషయం ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఏపీ సర్కారుపై ఎటు నుంచి దాడి జరిగినా.. అంతో ఇంతో కొందరు స్వాములు కాపాడుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఏ స్వామీ కూడా వైసీపీని కాపాడే పరిస్థితి లేకుండా పోయిందనే వాదన పార్టీ నేతల నుంచి వినిపిస్తుండడం గమనార్హం. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంలో డబ్బున్న వారికోసం కోటి రూపాయల టికెట్‌తో ఉదయాస్తమాన దర్శనం/ సేవను ప్రవేశ పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎవరు ఎలా స్పందించినా.. హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతులు మాత్రం సీరియస్ అయ్యారు.
ఉదయాస్తమాన సేవలను రూ.కోటికి వేలం వేయడం అనుచితమైన నిర్ణ యంగా వారు పేర్కొంటున్నారు వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పడం హాస్యాస్పదమని కూడా తప్పుబడుతున్నారు. ఈ మేరకు పంపాక్షేత్రం, కిష్కింధ, స్వర్ణహంపి మఠాధిపతి గోవిందానంద సరస్వతి ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. శ్రీవారి సేవలను రూ.కోటికి వెలకట్టే అధికారం టీటీడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన పాలకమండలి అవినీతికి కేరాఫ్‌గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమలలో ఐఏఎస్ అధికారులు ఆలయ సంప్రదాలను భ్రష్టుపట్టిస్తూ, అర్చకులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి టీటీడీ నుంచి ఈవో, చైర్మన్, ధర్మకర్తల మండలి ప్రతినిధులు గౌరవప్రదంగా బయటకు వెళ్లిపోయి పెద్దజియ్యర్, చిన్నజియ్యర్‌లకు బాధ్యతలు అప్పగించాలన్నారు. అయితే.. ఈయన ఒక్కడే ఇలా వ్యాఖ్యానించలేదు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కూడా ఏపీ సర్కారుపై ఫైరయ్యారు. శ్రీవారి దర్శనాన్ని కేవలం డబ్బున్న వారికే పరిమితం చేస్తున్నారా! అన్న సందేహం కలుగుతోందన్నారు.
ఎవరిని అడిగి టికెట్ల ధరలు పెంచుతున్నారు? అని నిలదీశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని, అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే టీటీడీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మొత్తంగా.. ఈ పరిణామాలు గమనిస్తే.. వైసీపీ నేతలు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి దీని నుంచి ఏ స్వరూపానంద సరస్వతీ కూడా రక్షించలేరని వ్యాఖ్యానిస్తున్నారు మేధావులు. మరి ఇప్పటికైనా జాగ్రత్త పడతారో లేదో చూడాలి.
This post was last modified on December 22, 2021 12:18 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…