Political News

సంబ‌రాల‌కు సై.. ఏపీలో అధికారిక ప్ర‌క‌ట‌న‌

ఈ నెల 21న(మంగ‌ళ‌వారం) ముఖ్యమంత్రి జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు చేసుకునేందుకు వీలుగా.. ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డిన ప్ర‌బుత్వం.. ఎట్ట‌కేల‌కు సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం.. పార్టీ శ్రేణులు.. జ‌గ‌న్‌పుట్టిన‌ రోజును ఘ‌నంగా నిర్వ‌హించుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలకు సన్నాహాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర పచ్చని గడ్డి మొక్కలతో సీఎం జగన్ చిత్రం రూపకల్పన చేశారు.

అదేస‌మ‌యంలో సీఎం జగన్ వీరాభిమాని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా పాటలను సిద్దం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు పాటల వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఈ పాట వింటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జ‌గ‌న్ పుట్టిన‌రోజు వేడుక‌లు నిర్వ‌హించుకుంటామ‌ని.. కోరుతున్నాయ‌ని.. అయితే.. రాష్ట్రం ఉన్న ప‌రిస్థితిలో భారీ ఎత్తున చేయొద్ద‌ని ముందుగా భావించామ‌ని.. అయితే.. ప్ర‌జ‌ల నుంచి కూడా ఒత్తిడి రావ‌డంతో సీఎం జ‌గ‌న్ సంబ‌రాల‌కు అంగీక‌రించార‌ని స‌జ్జ‌ల వ్యాఖ్య‌నించారు.

అయితే.. సంబ‌రాల‌ను గౌర‌వంగా.. సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలోనేజ‌రుపుకోవాల‌ని సీఎం సూచించిన‌ట్టు తెలిపారు. ఎవ‌రూ మ‌ద్యం తాగి చిందులు వేయ‌డం.. డీజే నృత్యాలు చేయ‌డం వంటివి చేసి.. కేసుల వ‌ర‌కు తెచ్చుకోవ‌ద్ద‌న్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై విమ‌ర్శ‌లు కూడా చేయొద్ద‌ని.. కేవలం సీఎం జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డిన తీరు, పాద‌యాత్ర‌, ఆయ‌న జీవితంలో ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌తోపాటు.. ఈ రెండేళ్ల పాల‌న‌పై జ‌గ‌న్ ఎలాంటి శ్ర‌ద్ధ తీసుకున్నారు.. సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి ప‌థ‌కాలు.. పేద‌ల‌కు ఎలాంటి ల‌బ్ధి చేకూరుతోంది.. వంటి కీల‌క విష‌యాల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. వారి ఆశీర్వాదం.. జ‌గ‌న్‌కు అందేలా ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. స‌జ్జ‌ల కోరారు. మొత్తానికి వైసీపీ నేత‌లు.. ఎదురు చూస్తున్న జ‌గ‌న్ సంబ‌రాల‌కు ప్ర‌బుత్వ‌మే ఆఫ్‌ది రికార్డుగా ప‌చ్చ‌జెండా ఊప‌డంతో శ్రేణులు ఎలా రెచ్చిపోతాయో చూడాలి.

This post was last modified on December 20, 2021 11:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

2 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

3 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

4 hours ago

రెహమాన్ పై రూమర్స్.. బాధతో తనయుడి వివరణ

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…

4 hours ago