ఇపుడు తెలుగుదేశం పార్టీలో కోవర్టుల ఆరోపణలు కలకలం రేపుతోంది. తాజాగా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని నేతలతో సమీక్షలో మాట్లాడుతు పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తానంటు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. నిజానికి పార్టీలో కోవర్టులున్నారని, వైసీపీ నేతలకు లోపాయికారీగా కొందరు తమ్ముళ్ళు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుండో వినిపిస్తున్నవే. అక్కడక్కడ కొందరు నేతలు కోవర్టుల గురించి చెప్పినపుడు చాలామంది పెద్దగా పట్టించుకోలేదు.
ఎప్పుడైతే స్వయంగా పార్టీ అధినేతే కోవర్టులనే వ్యాఖ్యలు చేశారో అప్పుడే దానికి ప్రాధాన్యత పెరిగింది. దాంతో ఇపుడు కోవర్టులు ఎవరనే విషయమై ఎవరికి వారు ఆరాలు తీస్తున్నారట. ఈ మధ్యనే గురజాల మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో వైసీపీ కోవర్టులున్నారంటు ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే కాదని జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా లోపాయికారీగా వైసీపీ నేతలతో కొందరు తమ్ముళ్ళకు సంబంధాలున్నట్లు ఆరోపించారు.
యరపతినేని విషయం వదిలేస్తే అంతకుముందు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కార్పొరేషన్లోని 58 డివిజన్లలో చాలా చోట్ల కావాలనే బలహీనమైన అభ్యర్థులను పోటీకి దింపినట్లు పెద్ద రచ్చే జరిగింది. వైసీపీ నేతలతో లోపాయికారీ ఒప్పందాల వల్లే బలహీనమైన అభ్యర్థులకు టికెట్లిచ్చినట్లు చాలామంది సీనియర్లు చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. అయితే కుప్పం మున్సిపల్ ఎన్నికల బిజీగా ఉన్న కారణంగా చంద్రబాబు పట్టించుకోలేదు.
అంతకన్నా ముందు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఆరోపణల తమ్ముళ్ళపై వచ్చాయి. చాలా డివిజన్లలో వైసీపీకి అనుకూలంగా కావాలనే బలహీనమైన వాళ్ళనే పోటీలోకి దింపినట్లు ఆరోపణలొచ్చాయి. ఇలాంటి ఆరోపణలు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. మరి అప్పట్లోనే చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావటంలేదు.
అయినా ఇతర పార్టీల్లో చంద్రబాబు కోవర్టులున్నారనే ఆరోపణలున్నపుడు ఇతర పార్టీల కోవర్టులు టీడీపీలో ఉన్నారనే ఆరోపణల్లో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. మంత్రి కొడాలి నాని ఈ మధ్య మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన పార్టీల్లో చంద్రబాబు కోవర్టులున్నారని టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఏ ఏ పార్టీల్లో చంద్రబాబు కోవర్టులుగా ఎవరెవరున్నారో కూడా కొడాలి పెద్ద జాబితానే చెప్పారు. సరే కొడాలి చెప్పిన జాబితా ఎలాగున్నా ప్రస్తుతం టీడీపీలో అయితే కోవర్టుల కలకలం మొదలైంది.
This post was last modified on December 11, 2021 12:51 pm
ఒకప్పుడు తెలుగులో స్టార్ హోదా అనుభవించి.. ఆపై మాతృ భాష తమిళంలోనే సినిమాలు చేసుకుంటున్న సిద్దార్థ్కు చాలా ఏళ్ల నుంచి…
స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ అంటే.. షూటింగ్ స్పాట్లో, బయట ఈవెంట్లకు హాజరైనపుడు ఉండే హడావుడే వేరు. షూటింగ్ అంటే..…
నిజమేనండోయ్.. ఏపీకి పెట్టుబడుల వరద ఆగట్లేదు. కూటమి సర్కారు పాలన మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.6.3 లక్షల కోట్ల…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో విశాక ఉక్కు పరిశ్రమను…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
ఏపీలో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుంచి బయటపడిపోయింది. భవిష్యత్తుల్లో…