Political News

రోజాతో బాలయ్య స్పెషల్ మీటింగ్ !

నందమూరి బాలకృష్ణ… ఏదైనా ప్రత్యేకించి సినిమా కార్యక్రమాల మీద తప్పించి మరెక్కడా అనవసరంగా మైకుల ముందుకు వచ్చి మాట్లాడానికి తాపత్రయపడడు. అనుకోకుండా ఓ తెలంగాణ ముఖ్యమంత్రితో మీటింగ్ సరిగ్గా బాలకృష్ణ పుట్టిన రోజుకు ఒక పది రోజుల ముందు జరగడం, దానికి బాలకృష్ణకు ఆహ్వానం రాకపోవడం, ఇది 60వ పుట్టిన రోజు కావడంతో అన్ని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తుండటంతో ఆ వివాదం పదేపదే చర్చకు వస్తోంది. ప్రతి మీడియా దాని గురించి అడగడం, మళ్లీ బాలకృష్ణ స్పందించడం కామన్ అయిపోయింది. అయితే, తాజాగా దీనికి భిన్నమైన ఒక పాజిటివ్ న్యూస్ అందరినీ ఆకర్షిస్తోంది. అది బాలకృష్ణ – రోజా మీటింగ్ గురించి వార్త.

బాలయ్య సినిమాల సంగతి పక్కన పెడితే… ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా ఉంటారని చెబుతుంటారు. ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. టీడీపీ దారుణంగా ఓడిన సందర్భంలో… ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మెజారిటీ కూడా తగ్గగా… బాలయ్య ఇమేజ్ మాత్రం పెరిగింది.

2014 ఎన్నికల కంటే 2019లో ఎక్కువ మెజారిటీతో హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు నందమూరి బాలకృష్ణ. అతను ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంపై దృష్టి పెట్టడం, మంచినీరు, సాగునీరు ఇవ్వడం, ఉపాధి కల్పన ఇలా పలు అంశాల్లో శ్రద్ద తీసుకుంటారట. అందుకే ప్రజలు ఆయనకు మరింత దగ్గరయ్యారట. బాలయ్య గురించిన తాజా వార్త గురించి కూడా దీనిని ఖరారు చేసేలాగానే ఉంది.

వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా తన నియోజకవర్గమైన హిందూపురం అభివృద్ధి కోసం బాలకృష్ణ ప్రయత్నాలు మానలేదు. తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజాను బాలకృష్ణ ఓ సాయం అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణే వెల్లడించారు.

హిందూపురం నియోజకవర్గాన్ని పలు విధాలుగా అభివృద్ధి చేశానని… పరిశ్రమల విషయంలో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఉద్యోగాలు వస్తాయని, అందుకే ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

ఇందుకోసం ఏపీఐఐసీ చైర్మన్ రోజాతో ప్రత్యేకంగా కలవనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. రోజా కూడా ఈ విషయం పట్ల సానుకూలంగానే స్పందించారని బాలకృష్ణ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత దీనిపై చర్చించేందుకు విజయవాడ రావాలని రోజా చెప్పారని, అధికారులతో కలిసి దీనిపై ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని రోజా చెప్పినట్టు బాలకృష్ణ తెలిపారు.

రోజాకి టీడీపీ అంటే బద్ధ శత్రువులా భావిస్తున్నా… మొన్న మండలిలో అంత వివాదాంలోను వీరిద్దరు కలిసి నవ్వుతూ దిగిన ఓ సెల్ఫీ పాపులర్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి సానుకూల సంబంధాలే ఉన్నట్లు అర్థమవుతోంది.

This post was last modified on June 8, 2020 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేను కేసీఆర్ కు కుక్కనే..కడియంకు పల్లా కౌంటర్

తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడిన సంగతి…

1 hour ago

జాక్ మిస్సవుతున్న కిక్స్ ఇవే

టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…

8 hours ago

బాబు ఔదార్యం చూసి చ‌లించిపోయా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. బాబు ఔదార్యం…

8 hours ago

బాలికపై 23 మంది మృగాళ్లు…7 రోజుల కీచకపర్వం

దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…

8 hours ago

“ఆమె నటిస్తేనే సినిమా… లేదంటే లేదు”

కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్‌గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…

8 hours ago

ట్రంప్ చర్యలకు బాబు బాధ్యుడా జగన్?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…

9 hours ago