ఏపీ ప్రభుత్వంపైనా.. సీఎం జగన్ నిర్ణయాలపైనా ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. ఇదేం ప్రభుత్వం అంటూ.. ఆయన నిలదీశారు. జగనన్న ఓటీఎస్-ఉరితాడు పథకాన్ని తీసుకువచ్చారంటూ.. ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ఇళ్లకు ఓటీఎస్.. పేదల మెడకు ఉరితాడుగా మారుతోందని చంద్రబాబు ఆరోపించారు. తప్పనిసరి కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు వసూళ్లను విమర్శిస్తే.. కేసులు పెడతారా? అని నిలదీశారు.
ఛీటింగ్ కేసులు.. 420 కేసులు ఈ ప్రభుత్వంపై పెట్టాలని దుయ్యబట్టారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లకు ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. బలవంతంగా వసూలు చేస్తూ… స్వచ్ఛందమంటారా? అని చంద్రబాబు నిలదీశారు. ఇప్పుడున్న సీఎం భూమి, రుణం, నిర్మాణ ఖర్చు ఇచ్చారా..? ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకు ఇప్పుడు వసూలు చేస్తారా? ఇంటి రుణం మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు. ఇచ్చిన మాట తప్పారు.. మడమ తిప్పారు. ఇప్పటికే జగన్ బయట తిరగలేకపోతున్నారు.
వైద్యానికి దాచుకున్న సొమ్ము ఓటీఎస్ కోసం వసూలు చేస్తారా? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు కూడా చట్టవిరుద్ధమే అని అభిప్రాయపడ్డారు. రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లే చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరుపడితే వాళ్లు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని తేల్చి చెప్పా రు. ఇష్టానుసారం చేస్తూ డాక్యుమెంట్లను వైసీపీ పతకాం రంగుల్లో ఇస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ద్రోహిగాఈ ప్రభుత్వం మిగులుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు.
“మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్‌కు అలవాటైంది. కేసులు మాపై కాదు… మీపై ఛీటింగ్ కేసు పెట్టాలి. తప్పుడు కేసులు పెడితే భయపడతారు అనుకుంటున్నారా?. డబ్బులు కట్టకపోతే పథకాలు రద్దవుతాయని బెదిరిస్తారా?. ఆడబిడ్డలకు ఒక్క రూపాయి తీసుకోకుండా మేం రిజిస్ట్రేషన్ చేయించాం. తప్పులను ప్రశ్నించే హక్కు మాకు లేదా? చట్ట ఉల్లంఘన చేసే వ్యక్తులకు శిక్ష తప్పదు. తప్పుడు కేసులకు భయపడి పోరాటాలు ఆపేది లేదు.“ అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీ ఎస్ పథకంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. పలు వీడియోలను ప్రదర్శించి చూపారు.
This post was last modified on December 6, 2021 6:20 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…