Political News

ట్రూ అప్ చార్జీలపై యూటర్న్

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి కూడా నెలకు దాదాపు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు రావడంతో జనానికి షాక్ తగిలినట్లయింది. ఇలా హఠాత్తుగా కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ ఎందుకు కొడుతోందని అడిగితే…ట్రూ ఆప్ ఛార్జీలంటూ ఏపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో, తడిసి మోపెడవుతున్న కరెంటు బిల్లులు కట్టలేక…చేసేదేమీ లేక జనం నానా తిప్పలు పడ్డారు.

ఈ వ్యవహారంలో జగన్ సర్కార్ పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా విద్యుత్‌ వినియోగదారులకు ఏపీఈఆర్ సీ ఊరటనిచ్చింది. ట్రూఅప్‌ ఛార్జీల కింద సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వసూలు చేసిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. నవంబర్‌లో వాడుకున్న విద్యుత్ కు సంబంధించి డిసెంబరులో ఇస్తున్న బిల్లులో ఆ చార్జీలను సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా వినియోగదారులకు ఇస్తున్న విద్యుత్‌ బిల్లులలో ఈ విషయం వెల్లడైంది.

వాస్తవానికి, గత రెండు నెలలుగా కరెంటు బిల్లుల మోత మోగుతోందంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. 2014–15 నుంచి 2018–19 మధ్యకాలానికి రూ.7,224 కోట్ల ట్రూ అప్‌ ఛార్జీల పిటిషన్లను విద్యుత్ సంస్థలు దాఖలు చేశారు. దీంతో, 2020 ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌ రూ.609 కోట్ల మొత్తాన్ని 8 నెలల్లో వసూలు చేయాలని నిర్ణయించుకున్నాయి.

మొదటి రెండు నెలల్లో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్‌ బిల్లులలో ట్రూ ఆప్ చార్జీలను బిల్లులో వడ్డించారు. అయితే, ఈ వ్యవహారంపై న్యాయపరమైన చిక్కులు రావడంతో ఏపీఈఆర్‌సీ వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే తాజాగా నవంబరు నెల బిల్లులో ట్రూఅప్‌ ఛార్జీలను కలపలేదు. అంతేకాదు, ఆ రెండు నెలలకు వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలను కూడా నవంబర్‌ నెల బిల్లు నుంచి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు చేస్తున్నారు. దీంతో, వినియోగదారులకు ఊరట లభించింది.

This post was last modified on December 6, 2021 1:28 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

1 hour ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

3 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

4 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

5 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

5 hours ago