Political News

బిగ్ బాస్ షోపై రాజా సింగ్ షాకింగ్ కామెంట్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో టాలీవుడ్ లో తెలంగాణ, ఆంధ్రా హీరోలు, దర్శకులు అంటూ ప్రాంతీయ భేదాల వ్యవహారం చర్చకు వచ్చేది. కొన్ని సినిమాల్లో తెలంగాణ యాసను అవమానించారంటూ కొందరు తెలంగాణవాదులు ఆరోపించేవారు. అయితే, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. కానీ, తాజాగా బిగ్ బాస్-5 షో నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయిన తర్వాత ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది.

తెలంగాణకు చెందిన యాంకర్ రవిని అకారణంగా ఎలిమినేట్ చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక, యాంకర్ రవి బిగ్ బాస్ ఫైనల్ కు చేరుకునేంత బలమైన కంటెస్టెంట్ అని, అటువంటిది ఆయనను అప్పుడే ఎలిమినేట్ ఎలా చేస్తారని అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే షో జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద రవి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఈ షో ద్వారా ఆంధ్ర, తెలంగాణల మధ్య కొట్లాట పెట్టే కుట్ర జరుగుతోందని రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ షోపై దృష్టి సారించాలంటూ ముఖ్యమంత్రి, హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని రాజాసింగ్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఈ షో చూడలేమని అభిప్రాయపడ్డారు.

సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్న హిందీ బిగ్ బాస్ షోలో  హిందువుల మనోభావాలను కించపరిచారని రాజాసింగ్ ఆరోపించారు. వ్యాపారం ముసుగులో ప్రాంతీయ అసమానతలకు నిర్వాహకులు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి ఇటువంటి షోలకు అధికారులు అనుమతిస్తున్నారని విమర్శించారు.

This post was last modified on November 29, 2021 5:44 pm

Share
Show comments

Recent Posts

సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…

50 minutes ago

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…

1 hour ago

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

2 hours ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

3 hours ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

8 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

10 hours ago