ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. జగన్ సర్కార్ విధానాలను ఎప్పటికప్పుడు పవన్ తూర్పారపడుతున్నారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ విరుచుకపడ్డారు. రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ఇసుక అమ్ముతానని ప్రభుత్వం ప్రకటించడం పవన్ ను ఆగ్రహానికి గురిచేసింది.
వరదల భీభత్సం రాష్ట్రాన్ని కుదిపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు-వాకిళ్లు, పశు నష్టం – పంట నష్టం జరిగిందని తెలిపారు. పచ్చటి- పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే.. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ‘ఇసుక అమ్ముతాం’ అన్న ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? అని పవన్ ప్రశ్నించారు.
కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలో వరదలు, భారీ వర్షాలతో ప్రజా జీవితం కడగండ్ల పాలైందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా నిలిచి సాయం అందిచాల్సిన ప్రభుత్వాన్ని కోరారు. కష్టకాలంలో ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం నిడబడిందనే భావన కూడా ప్రజల్లో కల్పించలేకపోతోందని తప్పుబట్టారు. జనసేన ఆధ్వర్యంలో రెండు విడుతలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తామని పవన్ ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని తెలిపారు.
“ప్రకృతి విపత్తులు చాలా ఇబ్బందికరమైనవి. విపత్తులను ఆపలేం.. కానీ స్పందించే తీరు మాత్రం ప్రభావవంతంగా ఉండాలి. దురదృష్టం ఏమిటంటే ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువయింది. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. తిత్లీ తుఫాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో 10 లక్షల మంది ప్రజలు రోడ్డున పడితే.. నాడు పక్క జిల్లా విజయనగరంలో పాదయాత్ర చేస్తున్న అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ కన్నెత్తి కూడా చూడలేదు. ఇది వారి ఆలోచన విధానాన్ని తెలియజేస్తోంది” జనసేన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
ఒక్కసారిగా విరుచుకుపడిన వరదల్లో గల్లంతైన వారు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా పవన్ కోరుకున్నారు. రాయలసీమ ప్రాంతలో 100 ఏళ్లల్లో రికార్డు కానంత వరద ప్రవాహం వచ్చిందని తెలిపారు. ఆస్తి నష్టం, పశు నష్టం, విలువైన వస్తువులు, వాహనాలు నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేకపోతున్నామని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on November 21, 2021 7:15 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…