Political News

ఏపీ బీజేపీ అత్యాశ

రాజ‌కీయ పార్టీల్లో చేరిక‌లు స‌హ‌జ‌మే. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పార్టీలు.. ఇత‌ర పార్టీల నుంచి నాయ‌కుల‌ను చేర్చుకుంటాయి. నేత‌లు కూడా త‌మ‌కు లాభాన్ని చేకూర్చేలా ఉన్న పార్టీవైపే మొగ్గుచూపుతారు. దేశ రాజ‌కీయాల్లో ఈ తంతు ఎప్ప‌టి నుంచో ఉంది. తెలుగు రాష్ట్రాలేమీ అందుకు మిన‌హాయింపు కాదు. ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌.. త‌న‌కు పోటీయే లేకుండా చేసుకోవ‌డానికి విప‌క్షాల నుంచి నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు 2019లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా టీడీపీ నుంచి కొంత‌మంది నాయ‌కులు ఆ పార్టీలోకి వెళ్లారు. కానీ ఇప్పుడు ఏపీలో చేరిక‌ల కోసం బీజేపీ ప్ర‌త్యేకంగా క‌మిటీలే వేస్తామ‌న‌డ‌మే హాస్యాస్ప‌దంగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ ఉనికి అంతంత‌మాత్ర‌మే. ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఎమ్మెల్సీల్లో అయితే ఒకే ఒక్క‌రున్నారు. నియోజ‌వ‌క‌ర్గాల వారీగా క్యాడ‌ర్ కూడా అంతంత‌మాత్ర‌మే. పార్టీని న‌డిపించే బ‌ల‌మైన నాయ‌కులే క‌నిపించ‌డం లేదు. బ‌లంగా ఉండే పార్టీలో లేదా బ‌ల‌ప‌డుతుంద‌నే న‌మ్మ‌కం క‌లిగించే పార్టీలో ఎవ‌రైనా చేరేందుకు సిద్ధ‌ప‌డ‌తారు. కానీ ఏపీలో బ‌ల‌హీనంగా ఉన్న బీజేపీలో చేరేందుకు ఎవ‌రు ముందుకు వ‌స్తార‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి.

అదీ కాకుండా పైగా ఆ చేరిక‌ల కోసం ప్ర‌త్యేకంగా క‌మిటీలు ఏర్పాటు చేస్తారంటా.. ఆ క‌మిటీ సిఫార్సుల మేర‌కే చేరిక‌లుంటాయ‌ని చెప్ప‌డం ఇంకా కామెడీ అని విశ్లేష‌కులు అంటున్నారు. అస‌లు చేరే వారే లేరంటే? ఇక క‌మిటీలు ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌పంచంలోని ఏ రాజ‌కీయ పార్టీ కూడా ఇలా చేరిక‌ల కోసం క‌మిటీ వేయ‌లేద‌ని చెప్తున్నారు.

ఇటీవ‌ల ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ అగ్ర‌నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాష్ట్ర పార్టీ నాయ‌కుల‌కు క్లాస్ పీకార‌ని స‌మాచారం. అమ‌రావ‌తి రైతు ఉద్య‌మానికి ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని, రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టాలని ఆయ‌న చెప్పార‌ని తెలిసింది. అందుకే చేరిక‌ల‌ను ప్రోత్స‌హించాల‌నే ఆయ‌న ఆదేశాల మేర‌కే ఇప్పుడీ క‌మిటీ వేసేందుకు సిద్ధ‌మవుతోంది. బీజేపీలో చేరేందుకు ఆస‌క్తి చూపించే పెద్ద పెద్ద నాయ‌కుల‌తో ఈ క‌మిటీ చ‌ర్చ‌లు జ‌రిపి ఆ ప్ర‌క్రియ స్మూత్‌గా జ‌రిగేలా చూస్తుంద‌ని తెలిసింది.

ఇప్పుడు అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీలో అసంతృప్త నాయ‌కులు పెద్ద‌గా లేరు. వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ త‌ప్ప ఇంకెవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఆయ‌న కూడా టీడీపీలో చేరే అవ‌కాశాలున్నాయి. ఇక జ‌న‌సేన.. బీజేపీ నుంచి ఎవ‌రైనా వ‌స్తే చేర్చుకుందామ‌ని చూస్తోంది. అంతే కానీ ఆ పార్టీ నుంచి బీజేపీలోకి ఎవ‌రూ రారు. ప్ర‌ధాన పార్టీల‌ను వ‌దిలేసి బీజేపీలో ఎవ‌రు చేర‌తార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

This post was last modified on November 21, 2021 3:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago