ఏ పార్టీకైనా పుంజుకునేందుకు కొన్ని ఆయుధాలు ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న వారు.. అధికార పార్టీలోని లోపాలను వెతుకుతారు. వాటిని ఆధారంగా చేసుకుని.. ప్రజల్లోకి వెళ్తారు. తమ తమ పార్టీలను బలోపేతం చేసుకుంటారు. అయితే.. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ వ్యూహం మరో మార్గంలో పయనిస్తోందని తెలుస్తోంది. తాజాగా ఏపీలో పర్యటించిన కేంద్ర బీజేపీ అగ్రనాయకుడు.. అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నాయకులకు కొన్ని సూచనలు చేశారు. వీటిలో ప్రధానంగా.. బీజేపీని.. సామాజిక వర్గాల వారీగా.. అభివృద్ధి చేయాలని..! అంతేకాదు.. ప్రధాన ప్రతిపక్షానికి వెన్నుదన్నుగా ఉన్న కీలకమైన.. కమ్మ సామాజిక వర్గాన్ని బీజేపీకి చేరువ చేయాలని కూడా షా దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలిసింది.
చంద్రబాబు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయం ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన ఒక సుదీర్ఘ ప్రసంగమే చేశారు. తాజాగా రాష్ట్ర నేతలతో భేటీ అయిన.. షా.. “చంద్రబాబుకు కమ్మ సామాజిక వర్గం అండ ఉందని అంటున్నారు. అయితే.. ఆ వర్గమే అండ ఉంటే.. ఆయన ఎందుకు ఓడిపోయారు? అంటే.. ఆ వర్గంలోనూ చంద్రబాబును వ్యతిరేకించే నాయకులు ఉన్నారు. అదేవిధంగా ప్రజల్లోనూ ఉన్నారు. సో.. ఇప్పుడు వారిని మనం చేరదీద్దాం. వారికి ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో.. చూడండి. నాకు త్వరలోనే నివేదిక ఇవ్వండి. అంతా నేను చూసుకుంటాను” అని షా తేల్చి చెప్పినట్టు బీజేపీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది.
అంతేకాదు.. కమ్మ సామాజిక వర్గాన్ని చేరదీసే బాధ్యతను పురందేశ్వరి సహా.. కొందరు కమ్మ నాయకులకు అమిత్ షా అప్పగించారని సమాచారం. అదే సమయంలో కమ్మ వర్గాన్ని ఆకర్షించేందుకు అనుసరించా ల్సిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేయాలని.. తద్వారా.. ప్రతిపక్షం ఓటు బ్యాంకును సగం వరకు మనం లాగేసేందుకు అవకాశం ఉంటుందని.. కూడా షా అభిప్రాయపడ్డారని చర్చ జరుగుతోంది.
ఇప్పటికే పురందేశ్వరి పార్టీలో జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నారు. అదే కమ్మ వర్గానికి చెందిన వెంకయ్య నాయుడుకు ఏకంగా ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చారు. ఇక కంభపాటి హరిబాబుకు మిజోరం గవర్నర్ పదవి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆ వర్గంలోకి బలంగా తీసుకు వెళ్లాలని కూడా షా ఆదేశాలు జారీ చేశారట. అదే సమయంలో నాయకులు సఖ్యతతో ఉండి పార్టీ కోసం పనిచేయాలని.. ప్రతి ఒక్కరూ నిత్యం యాక్టివ్‌గా ఉండాలని.. సొంత వ్యాపారాలను పక్కన పెట్టి.. పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని.. కూడా సూచించారట. వచ్చే రెండేళ్లు ఒక పరీక్షా కాలంగా నాయకులు భావించాలని కూడా షా దిశానిర్దేశం చేసినట్టు బీజేపీలో చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 17, 2021 9:41 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…