అవసరానికి తగ్గట్లు నిర్ణయం తీసుకోవటం.. అది కూడా సమయానికి తగ్గట్లుగా ఉండటం చాలా తక్కువమంది చేసే పని. తాజాగా అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ సర్కారు.
ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు సెల్ ఫోన్లు.. ట్యాబులు.. ల్యాప్ టాప్ అవసరం బాగా పెరిగినట్లే. ఆ విద్యార్థి.. ఈ విద్యార్థి అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆన్ లైన్ క్లాసుల దిశగా.. స్కూళ్లు ప్లాన్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీల్లో చదువుకునే విద్యార్థులకు సెల్ ఫోన్లను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. నిరుపేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో చదువుకునే తొమ్మిది నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా సెల్ ఫోన్ ఇవ్వనున్నారు. దాదాపు 60 వేల మంది వరకు ఈ పథకంలో భాగంగా లబ్థిదారులు కానున్నారు. ఒక్కో విద్యార్థికి ఐదారు వేల రూపాయిలు విలువ చేసే స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనున్నారు.
రానున్న రోజుల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండటం.. ఆ కార్యక్రమాన్ని ఫాలో కావాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. దీంతో.. రాష్ట్రంలోని 60వేల మంది విద్యార్థులకు సెల్ ఫోన్లు అందించాలని నిర్ణయించారు. అంతేకాదు.. నెలకు ఒక్కో పాఠశాలకు 300 సోడియం హైపోక్లోరైట్.. 150 లీటర్ల సోప్ లిక్విడ్ సరఫరా చేయటంతో పాటు.. 189 గురుకులాల్లో ఇంగ్లిషు ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుచూపుతో తీసుకునే ఈ తరహా నిర్ణయాల్ని తెలంగాణ సర్కారు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 6, 2020 11:33 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…