దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలుగా పేరున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లపై ఇటీవల కాలం లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్రం చెప్పుచేతుల్లో ఉన్నాయనే వాదన కూడా ఉంది. ముఖ్యంగా తమకు ఇష్టంలేని నాయకులపైనా.. తమకు ఎదురు మాట్లాడే రాష్ట్రాలపైనా.. ఈ సంస్థలను ప్రయోగిస్తు న్నారనే వాదన కూడా ఉంది.
గతంలో కాంగ్రెస్ హయాం నుంచే ఈ రెండు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారనే వాదన కోర్టులు సైతం వ్యక్తం చేశాయి. అంతేకాదు.,. తమకు నచ్చిన వారిపై ఒక విధంగా .. నచ్చకపోతే.. మరో విధంగా ఈ రెండు సంస్థలను ప్రయోగిస్తున్నారనే విమర్శలు వున్నాయి.
దీనికి దేశంలో అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. సీబీఐ డైరెక్టర్లుగా, ఈడీ అధికారులుగా ఉన్నవారిని కేంద్రం మేనేజ్ చేస్తోందని.. గతంలో ప్రముఖ జర్నలిస్టు.. పాలగుమ్మి సాయినాథ్ వంటి వారు కూడా తప్పుబట్టారు.
పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన ఈ సంస్థలను తమ సొంత సంస్థలుగా.. రాజకీయ అవసరాలకు వినియోగించుకునే.. ఇంటి సంస్థలుగా మార్చుకుంటున్నారనే వాదన ఉంది. అయితే.. ఎవరు ఎలా వాడుకున్నా.. ఇప్పటి వరకు.. సీబీఐ.. ఈడీ డైరెక్టర్ల విషయంలో ఒకింత వెసులుబాటు ఉండేది. వారు రెండేళ్ల కాలపరిమితికి మించి.. ఈ పదవుల్లో ఉండే అవకాశం లేదు.
సో.. ఈ క్రమంలో.. ఆయా పదవుల్లోకి వచ్చినవారు.. రెండేళ్ల కాలంలో.. కేంద్రానికి కొందరు సాహో.. అన్న వారు ఉన్నా.. మరికొందరు నిక్కచ్చిగా ఉన్నవారు కూడా ఉన్నారు. దీంతో అంతో ఇంతో న్యాయం జరిగిన సందర్భాలు ఉన్నాయి.
అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఏకంగా ఐదేళ్లకు పెంచుతూ నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా సంచలనమే. ఎందుకంటే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు వీటి పదవీ కాలం.. రెండేళ్లే.
రాజ్యాంగ బద్ధమైన ప్రత్యేక ప్రాతిపదిక కూడా ఉంది. అయినప్పటికీ.. ఈ పదవీ కాలాన్ని.. మూడేళ్లు పెంచేస్తూ.. నిర్ణయం తీసుకోవడం వెనుక.. డైరెక్టర్లను తమ చెప్పు చేతల్లో పెట్టుకునే వ్యూహానికి మరింత పదును పెట్టే అవకాశం ఉందని.. విశ్లేషకులు.. భావిస్తున్నారు.
ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం ప్రకారం రెండేళ్ల పదవీకాలంతో కొనసాగుతున్న సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. సో.. దీనిని బట్టి.. మోడీ అధికారాలు మరింత విస్తృతం.. కానున్నాయనడంలో సందేహం లేదని అంటున్నారు. మరి ఇలాంటి పోకడలు న్యాయ బద్ధంగా నిలుస్తాయా? ఎవరైనా.. కోర్టుకు వెళ్తే.. ఏం సమాధానం చెబుతారు? అసలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం రాబట్టాల్సి ఉంది.
This post was last modified on November 15, 2021 7:33 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…