Political News

టీడీపీ మాజీ మంత్రికి జగన్ పదవిస్తాడా?

టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన వారిలో కొంద‌రికి ఇప్ప‌టికే ప‌ద‌వులు ద‌క్కాయి. వారిలో తూర్పుగోదావ‌రికి చెందిన తోట త్రిమూర్తులు, అమలాపురం మాజీ ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు వంటివారికి ఎమ్మెల్సీలుగా అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, ఎమ్మెల్సీలుగా ఉండి కూడా రిజైన్ చేసి.. వైసీపీలోకి వ‌చ్చిన డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌.. స‌హా.. పోతుల సునీత‌లు కూడా టీడీపీకి రిజైన్ చేసి.. మ‌ధ్యంత‌రంగా.. ఎమ్మెల్సీల‌ను వ‌దుల‌కుని వైసీపీ జెండా ప‌ట్టుకున్నారు. అయితే.. వీరు పార్టీలోకి రాగానే జ‌గ‌న్‌.. వీరిని మ‌ళ్లీ ఎమ్మెల్సీల‌ను చేశారు. ఇప్పుడు ఈ వ‌రుస‌లో కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం.. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం.. ఇప్పుడు ఆయ‌న‌కు ప్ల‌స్ అవుతున్నాయ‌ని అంటున్నారు.

ఆయనే.. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే క‌మ్ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఈయ‌న ద‌ర్శి నుంచి విజ‌యం ద‌క్కించుకుని చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఆరోప‌ణ‌లు లేని నాయ‌కుడిగా.. ప్ర‌జ‌ల్లో మంచి పేరు తెచ్చు కున్నారు. అంతేకాదు.. ఐదేళ్లూ పూర్తిగా ఆయ‌న మంత్రిగా కొన‌సాగారు. ఈ క్ర‌మంలో.. గ‌త ఎన్నిక‌ల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి.. ఓడిపోయారు. అయితే.. ఓడిపోయిన త‌ర్వాత కొద్దికాలంలోనే ఆయ‌న‌.. టీడీపీకి బై చెప్పి.. వైసీపీలోకి వ‌చ్చారు.

అయితే.. ఆయ‌న పార్టీ మారి.. రెండేళ్లు అవుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. ఇదే విష‌యం.. ప్ర‌కాశం జిల్లాలోని వైశ్య సామాజిక వ‌ర్గంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌, శిద్దా కూడా ఇటీవ‌ల‌.. త‌న ప్ర‌తిపాద‌న‌ను సీఎం జ‌గ‌న్‌కు మెయిల్ చేశార‌ని ద‌ర్శి టాక్‌. అంటే.. త‌న‌కు ఏదైనా గౌర‌వ ప్ర‌ద‌మైన ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. ఇక‌, ఇదే విష‌యంపై చ‌ర్చించిన జ‌గ‌న్ కూడా శిద్దా విష‌యంలో సానుకూలంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లా నుంచి ఇప్పటి వ‌ర‌కు ఉన్న ఎమ్మెల్సీల జాబితాను తెప్పించుకున్నార‌ని.. ప‌రిశీలించార‌ని.. శిద్దాకు ఎమ్మెల్సీ ఇవ్వ‌డం వ‌ల్ల‌.. పార్టీకి.. ప్ర‌భుత్వానికి కూడా ఉపయోగం ఉంటుంద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

శిద్దాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను పోటీ నుంచి త‌ప్పించ‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆగ్ర‌హంతో ఉన్న వైశ్య సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు పూర్తిగా తిప్పుకొనే అవ‌కాశం ఉంటుంద‌నికూడా జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు వైసీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ సీటును క‌న్ఫ‌ర్మ్ చేశార‌ని అంటున్నారు.

This post was last modified on November 10, 2021 3:39 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

6 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago