తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయగలరా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. పెట్రోల్, డీజిల్ పై తన స్టాండ్ ఏమిటనే విషయాన్ని కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. పెట్రోలుపై రు. 5, డీజల్ పై రు. 10 తగ్గించిన కేంద్రం ఇదే దామాషాలో రాష్ట్రాలను కూడా తగ్గించాలని చెప్పింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. నిజానికి గడచిన ఏడాదికాలంగా ఇంధన ధరలను పెంచేస్తున్న కేంద్రం ఇపుడు తగ్గించింది చాలా తక్కువన్న విషయాలు మరచిపోయాయి.
ఇంధన ధరలను దాదాపు 60 రూపాయలు పెంచి 5, 10 రూపాయలను తగ్గించటమంటే చాలా విచిత్రంగా ఉంది. అయినా సరే కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించటంతో ఆయా రాష్ట్రాల్లో ఇంధన ధరలు సగటున 13 రూపాయలు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కేసీయార్, జగన్ను టార్గెట్ చేసుకుని పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించాలంటూ నానా గోల చేస్తున్నాయి. విచిత్రమేమిటంటే పెట్రోలు, డీజల్ ధరలు పెరిగిపోతున్నపుడు ఈ పార్టీల్లో ఒక్కటి కూడా కేంద్రాన్ని నిలదీయలేదు.
ఇదే విషయమై మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీయార్ పెట్రలు, డీజల్ ధరల్లోని మొత్తం సర్ చార్జీలను తీసేయాలంటు డిమాండ్ చేశారు. రాష్ట్రాల నోళ్ళు కొట్టి పన్నుల రూపంలో కేంద్రం సంపాదిస్తోందంటు మండిపోయారు. సంవత్సరాల తరబడి కేంద్రం జనాలను చావగొట్టి అడ్డమైన పన్నులు వేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆరోపించారు. పెట్రో ఉత్పత్తుల మీద తాను ఒక్కపైసా కూడా పెంచలేదు కాబట్టి పెట్రోలు, డీజల్ ధరలు తాను ఎందుకు తగ్గించాలంటూ ప్రతిపక్షాలను ఎదురు ప్రశ్నించారు.
సరిగ్గా ఇక్కడే జగన్ తో పోలిక తెస్తున్నారు జనాలు. నిజానికి జగన్ కు కూడా పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించే ఉద్దశ్యం ఉన్నట్లు లేదు. అయితే ఆ విషయాన్ని డైరెక్టుగా మీడియా సమావేశం పెట్టి చెబితే బాగుంటుంది. తాను చెప్పకపోయినా మంత్రులతో అయినా చెప్పించాలి. కానీ జగన్ ఆపని చేయకుండా రెండు దినపత్రికల్లో అనవసరంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అది కూడా డొంకతిరుగుడుగానే ఉంది. సూటిగా ప్రభుత్వ వాదన ఏమిటి అనేది కేసీయార్ చెప్పినట్లు స్పష్టంగా లేదు.
నిజానికి పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించేది లేదని కేసీయార్ చెప్పినట్లుగానే జగన్ కూడా చెప్పవచ్చు. ప్రభుత్వ స్టాండ్ ఏమిటనే విషయాన్ని జనాలకు వివరించి చెప్పటంలో తప్పేలేదు. జగన్ చెప్పదలచుకున్నది జగన్ చెబితే జనాలు అర్ధంచేసుకునేది జనాలు అర్ధం చేసుకుంటారు. పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించేది లేదని కేసీయార్ స్పష్టంగా చెప్పినపుడు జగన్ మాత్రం ఎందుకు చెప్పలేరు ? ప్రకటనల రూపంలో ప్రభుత్వం నిధులను వృధా చేసేకన్నా మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలను వివరిస్తే జనాలే అర్ధం చేసుకుంటారు. మరి జగన్ అంత ధైర్యం చేయగలరా ?
This post was last modified on November 8, 2021 7:00 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…