తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. విషయంలో ఎప్పటికప్పుడు.. ఆశ్చర్యకర సంఘటన లు జరుగుతూనే ఉన్నాయి. ఆమె మరణించి.. ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ.. కొన్ని కొన్ని విషయాలు జయ చుట్టూనే గిరిగిర లాడుతున్నాయి. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల జయ సంపదను.. సొంతం చేసుకు నేందుకు పలువురు ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెకు నేనే కుమార్తెనంటూ.. ఇప్పటికే పలువురు తెరమీదికి వచ్చారు. వీరిలో ఒకరు ఏకంగా ఆధారాలు సమర్పిస్తే.. మరొకరు.. వీలునా మా.. అంటూ.. గత ఏడాది హడావుడి చేశారు.
అయితే.. ఇవన్నీ.. కూడా కోర్టు విచారణలో వీగిపోయాయి. అయితే.. తాజాగా ఇన్నాళ్లకు మరో మహిళ.. నేనే జయలలిత కుమార్తెనంటూ..తెరమీదకి వచ్చారు. చెన్నైలోని పల్లావరం ప్రాంతానికి చెందిన ఆమె.. తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ.. చూపించారు. తన పేరు ప్రేమ అని, పల్లావరం ప్రాంతంలో ఉంటున్నా నని.. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తాను కుమార్తెనని చెప్పుకొచ్చారు. తొలుత.. మెరినాలోని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన ఆమె.. అనంతరం.. మీడియాతోనూ మాట్లాడారు.
నేను మైసూరులో పుట్టాను. చెన్నైలో 30 ఏళ్లకు పైగానే ఉంటున్నాను. నేను జయలలిత కుమార్తెను అని చెప్పడానికి నా దగ్గర చాలానే ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు.. వాటిని బయట పెడతా అని చెప్పుకొచ్చారు. త్వరలోనే తాను జయ సన్నిహితురాలు.. శశికళను కలుస్తానని చెప్పారు. తనను పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులు.. మృతి చెందినట్టు తెలిపారు. జయ లలిత తనను బేబీ అని పిలిచేదని.. అపోలో ఆసుపత్రిలో జయలలితం చికిత్స పొందుతున్న సమయంలో తాను.. ఆసుపత్రి వెనుక మార్గం నుంచి వెళ్లి.. ఆమెను పరామర్శించినట్టు ప్రేమ తెలిపింది.
అంతేకాదు.. జయలలిత సహాయకుడు.. ముత్తు స్వామికి ఈ విషయాలు తెలుసునని ఆమె పేర్కొంది. ఆ సమయంలో జయ తనకు ముద్దు కూడా పెట్టినట్టు ప్రేమ తెలిపింది. అంతేకాదు.. జయ కోరిక మేరకు ఒకసారి తాను పోయెస్ గార్డెన్‌కు కూడా వెళ్లినట్టు ప్రేమ చెప్పడం గమనార్హం. అయితే.. ప్రస్తుతం ఇప్పటికే ఇద్దరి నుంచి ముగ్గురు.. జయ తమ తల్లే అంటూ.. రావడం.. కోర్టుకు కూడా వెళ్లడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రేమ వ్యవహారం.. ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on November 8, 2021 11:23 am
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…