జార్జ్ ఫ్లాయిడ్.. పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరిది. నల్ల జాతీయుడైన ఇతడి పట్ల అమెరికాలో ఓ శ్వేత జాతికి చెందిన పోలీస్ అధికారి మే 25న కిరాతకంగా వ్యవహరించాడు. ఓ కేసుకు సంబంధించి పట్టుబడిన ఫ్లాయిడ్‌ను కింద పడేసి అతడి మెడ మీద మోకాలు పెట్టి నొక్కుతూ ఐదు నిమిషాల పాటు అతణ్ని చిత్రవధకు గురి చేశాడు. దీంతో అతను ఊపిరాడక ప్రాణాలు వదిలాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో అమెరికాలో నల్ల జాతి సమాజం భగ్గుమంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై నిరసనలు గళాలు వినిపిస్తున్నాయి. అసలే కరోనాతో అల్లాడుతున్న అమెరికా ఈ వివాదం కారణంగా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకీ జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు.. అతడి నేపథ్యం ఏంటి.. అతడిని ఏ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.. అని శోధిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళ్తే…
జార్జ్ ఫ్లాయిడ్ వయసు 46 ఏళ్లు అతనో సాధారణ కుటుంబానికి చెందిన వాడు. 6 అడుగుల 6 అంగుళా ఎత్తున్న జార్జ్.. యుక్త వయసులో బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ ఆడేవాడు. డిగ్రీ చదువును మధ్యలో వదిలేసిన అతను.. క్రిమినల్‌గా మారాడు. డ్రగ్ మాఫియాలో అడుగు పెట్టాడు. డ్రగ్స్ సరఫరా, దొంగతనం కేసుల్లో అనేకసార్లు అరెస్టయ్యాడు. మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నేరంపై 2007లో కోర్టు ఫ్లాయిడ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు నుంచి విడుదలయ్యాక మంచి మనిషిగా మారాలని భావించిన జార్జ్.. మత సంస్థ అయిన రిసరెక్షన్ హ్యూస్టన్‌లో చేరాడు.
ఒకప్పుడు తుపాకీ చేతబట్టి నేరాలకు పాల్పడ్డ జార్జ్.. 2017లో తుపాకీ హింసను విడనాడాలంటూ ఫ్లాయిడ్ ఓ వీడియో సందేశం ఇచ్చాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెడు మార్గం పట్టిన యువతను అతను మార్చే ప్రయత్నం కూడా చేశాడు. క్రైస్తవ మిషనరీ ‘సాల్వేషన్ ఆర్మీ’లో ప్లాయిడ్ కొన్నాళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. కొన్నాళ్లు లారీ డ్రైవర్‌గా, ఓ డ్యాన్స్ క్లబ్‌లో బౌన్సర్‌గా కూడా పని చేశాడు.
ఐతే కరోనా సంక్షోభం కారణంగా వ్యాపారాలు దెబ్బతినడంతో చాలామంది అమెరికన్లలాగానే ఫ్లాయిడ్ కూడా ఇబ్బందుల్లో పడ్డాడు. పోలీసులు అతణ్ని అరెస్టు చేసింది 20 డాలర్ల నకిలీ నోటుతో సిగరెట్లు కొనడానికి ప్రయత్నించడం. ఫ్లాయిడ్ పాత రికార్డును దృష్టిలో ఉంచుకుని పోలీస్ అతడితో అమానుషంగా వ్యవహరించాడు. చివరికి అతడి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు
This post was last modified on %s = human-readable time difference 12:20 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…