సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో పలు పరిణామాలు వివాదాస్పదమవ్వడం చర్చనీయాంశమైంది. ఓ పక్క టీటీడీని మరింత అభివృద్ధి చేసేందుకు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ నూతన పాలక మండలి కసరత్తు చేస్తుండగా…..మరో పక్క వరుస వివాదాలు టీటీడీని వెంటాడుతున్నాయి.
తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం మొదలుకొని…టీటీడీ భూముల వేలంపాట, సప్తగిరి మాసపత్రికలో లవకుశ కథ వరకు పలు వివాదాలు టీటీడీని చుట్టుముట్టాయి.
ఇక, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ సినీ నటుడు పృథ్వీ ఆడియోటేపు వ్యవహారం పెను దుమారం రేపింది. టీటీడీకి చెందిన ఆస్తుల వేలం వ్యవహారం వివాదాస్పదం కావడంతో….టీటీడీ ఆస్తుల వేలంపై ఏకంగా నిషేధం విధించాల్సి వచ్చింది. దీంతోపాటు, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం….చర్చనీయాంశమైంది.
మరోవైపు, జగన్ అధికారం చేపట్టిన తర్వాత వరుసగా టీటీడీలో వివాదాలు చెలరేగడంతో జగన్ ప్రభుత్వం హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకుంటోందని పలువురు విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో కొంతమంది కోవర్టులుగా పనిచేస్తున్నారన్న అనుమానాలను వైవీ వ్యక్తం చేస్తున్నారు. లవకుశ కథ వివాదం తాజాగా ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా పలువురు రామ భక్తుల మనోభావాలను ఆ కథ దెబ్బతీసింది.
దీంతో, ఆ విషయంపై ఆగ్రహంతో ఉన్న వైవీ….ఆ కథ వ్యవహారంలో చర్యలకు ఆదేశించారు. సంబంధిత ఎడిటర్‌పై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతర్గతంగా దేవాలయ ప్రతిష్ఠను కించపరిచేందుకు, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కారణమవుతున్న వారిపై చర్యలకు ప్రత్యేక కమిటీ వేశామని చెప్పారు. కొంతమంది కావాలనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని, వారిపై ఫోకస్ చేస్తున్నామని చెప్పారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించబోమని,చెప్పారు.
This post was last modified on June 4, 2020 1:29 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…