Political News

ఆ పదానికి అర్థమేంటి.. తెగ వెతికేస్తున్న నెటిజన్లు

బోసిడీకే.. ఇప్పుడీ పదం ఎక్కడ లేని ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి అర్థమేంటో తెలియకుండానే ఎప్పట్నుంచో తెలుగు జనాలు తెగ వాడేస్తున్నారు. సరదాగా తిట్టాల్సి వచ్చినపుడు ఈ మాటను ఉపయోగిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం నేత పట్టాభిరామ్ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మాట అనడంతో పెద్ద దుమారమే రేగింది.

రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ కార్యాలయాలు, అలాగే పట్టాభిరామ్ ఇంటిపై వైసీపీ శ్రేణులు భయానక రీతిలో దాడులు చేయడంతో.. ఆ తర్వాత టీడీపీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆందోళనలు చేపట్టడం.. మరోవైపు పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్టు చేయడం.. ఇలా చాలా పరిణామాలే చోటు చేసుకున్నాయి గత కొన్ని రోజుల్లో.

వైసీపీ వర్గాల దాడులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా జగన్.. తననుద్దేశించి పట్టాభిరామ్ అన్న ‘బోసిడీకే’ అనే పదానికి ‘లం.. కొడుకు’ అనే అర్థం అంటూ ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమం మధ్యలో స్టేజ్ మీద చెప్పడం చర్చనీయాంశం అయింది.

జగన్ నోట ఈ పదం విన్నాక నిజంగా ఆ మాటకు ఆ అర్థం వస్తుందా అని ఇంటర్నెట్లో తెలుగు జనాలు ఆ పదానికి అసలర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా జగన్ అన్న అర్థమే వస్తుందనే సమాచారం అయితే ఇంటర్నెట్లో కనిపించడం లేదన్నది నెటిజన్లు చెబుతున్న మాట.

పైగా ఒక హిందీ పాట వీడియోలో ఈ పదాన్ని విరివిగా వాడటం గురించి ప్రస్తావిస్తున్నారు. నిజంగా అంత బూతు పదమే అయితే ఈ పాటలో అన్నిసార్లు ఆ పదాన్ని వాడేవాళ్లా.. ఇదొక తిట్టే అయ్యుండొచ్చు తప్ప, జగన్ అన్న అర్థం మాత్రం రాదు అంటూ కొందరు నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఈ పదం వాడిన హిందీ పాట మాత్రం సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.

ఇంతకీ ‘బోసిడీకే’ అనే పదానికి అర్థం ఏంటన్నది హిందీ కూడా బాగా వచ్చిన వాళ్లు నిర్మాణాత్మకంగా వివరించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఈ పదానికి అర్థమేంటన్న దాన్ని బట్టి పట్టాభిరామ్ మీద కేసు నిలబడే అవకాశముంది.

This post was last modified on October 23, 2021 2:43 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

29 minutes ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

1 hour ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

1 hour ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

3 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

3 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

3 hours ago