ఆ ఎమ్మెల్యే సీఎం జగన్ తర్వాత అత్యంత మెజార్టీతో విజయం సాధించారు. దీన్ని బట్టి సహజంగా మనం అక్కడ వైసీపీకి బలమైన పునాదులున్నాయని అనుకుంటాం. పార్టీకి బలమైన కేడర్ ఉంది అనుకుంటాం. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముతుమల అశోక్‌రెడ్డిపై వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబుపై అక్షరాల 81520 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జగన్ తర్వాత వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది ఇక్కడే. ఇలాంటి చోట టీడీపీకి వ్యతిరేకంగా ప్రజాగ్రహ దీక్ష నిర్వహిస్తే భారీ స్పందన సంగతి తర్వాత.. అసలు సగం కుర్చీలు కూడా నిండలేదు. జనం లేక వెలవెల పోయింది. దీక్ష కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ పట్టుమని పదిమంది కూడా దీక్షలో పాల్గొన లేదు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పోటీగా అధికార పార్టీ నేతలు కూడా ప్రజాగ్రహ దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలకు కొన్ని ప్రాంతాల్లో మద్దతు వస్తోంది. కానీ చాలా ప్రాంతాల్లో జనం లేక వేదికలు బోసిపోతున్నాయి. మిగతా చోట్ల సరే. కానీ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం భారీ మెజార్టీ వచ్చిన చోట ఇలా ఎందుకు జరిగిందని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
అక్కడి ఎమ్మెల్యే తీరే దీనికి కారణమా? లేక ప్రజల్లో మార్పు వచ్చిందా? లేకపోతే ప్రజాగ్రహ దీక్ష కాదు అది వైసీపీ రాజకీయ దీక్ష అని ప్రజలు అనుకున్నారా అన్నది తెలియడం లేదు. దీక్షలో ఖాళీ కుర్చీలు కనిపించడంతో పార్టీ నేతలు ఇన్ సల్ట్ గా ఫీలయ్యారు. ఈ కార్యక్రమ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on October 23, 2021 10:50 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…