సుమారు మూడు నెలల తర్వాత హైదరాబాదు రోడ్లపై సిటీ బస్సులు పరుగెట్టనున్నాయి. ఇప్పటికే రెండున్నర నెలలుగా సిటీ బస్సులు ఆగిపోయాయి. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇక ప్రజారవాణాను ప్రారంభించడానికే తెలంగాణ సిద్ధమైంది.
జూన్ 8 నుంచి హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అయితే మునుపటి లాంటి ప్రయాణం ఉండదు. రద్దీగా తిరిగే బస్సులు కనపడవు. సీట్ల వరకే మనుషులు పరిమితం. ఒకప్పుడు కిక్కిరిసి తిరిగిన బస్సులు ఇప్పట్లో అలా కానరావు.
తాజాగా ఈరోజు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం సడలింపులతో ఇప్పటికే ఆఫీసులన్నీ తెరుచుకున్నాయి. ప్రైవేటు వాహనాలు మినహా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా ప్రారంభించడానికి తెలంగాణ సర్కారు సిద్ధమైంది.
కరోనా ముందు నగరంలో రోజుకు దాదాపు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఇపుడు ప్రత్యేక నిబంధనలతో ఆ సంఖ్య గణనీయంగా పడిపోనుంది. బస్సుల్లేక షేర్ ఆటోలు పోలీసుల కళ్లు గప్పి తిప్పుతున్నారు. ఇద్దరిని ఎక్కించాల్సిన ఆటోలు నలుగురు ఐదుగురిని ఈ పరిస్థితుల్లో కూడా ఎక్కిస్తున్నారు.
This post was last modified on June 3, 2020 9:29 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…