తన వివాదాస్పద కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ‘మా’ ఎలెక్షన్స్ పై ఘాటుగా స్పందించారు వర్మ. ‘మా’ ఒక సర్కస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ ఆయన కామెంట్స్ చేశారు.
గురువారం నాడు ఉదయం ట్విట్టర్ వేదికగా ఏపీ రాజకీయాలపై సెటైర్లు వేశారు వర్మ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సిందే అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇదంతా మీ డైరెక్షనే కదా..?’ అంటూ కొందరు.. ‘ఏపీ దంగల్ సినిమా తీయొచ్చు కదా ఆర్జీవీ గారు’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కొందరు దారి చేయడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు బంద్ నిర్వహించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మరోపక్క ఈ దాడులను నిరసిస్తూ.. గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు.
This post was last modified on October 21, 2021 3:25 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…