దక్షిణాదిలో పుంజుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్న బీజేపీ అందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీ దూసుకు పోతుంది. పొత్తుల పెట్టుకుంటూ ముందుకు సాగాలని చూస్తోంది. ఇప్పుడు తమిళనాడులోనూ ఆ పార్టీ వ్యూహాలు రచిస్తుందన్న వార్తలు వస్తున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ తిరిగి అన్నాడీఎంకే పార్టీలోకి రావాలనుకోవాలనే నిర్ణయం వెనక బీజేపీ ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఈ చిన్నమ్మ శశికళ.. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కానీ ఇటీవల మళ్లీ మనసు మార్చుకుని పార్టీలోకి వస్తున్నట్లు తెలిపారు. ఇలా సడెన్‌గా ఆమె పార్టీ వైపు అడుగులు వేయడం వెనక బీజేపీ హస్తం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. కానీ డీఎంకే ధాటికి ఓటమి తప్పలేదు. ఇప్పటికే అన్నాడీఎంకేలో పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలున్నాయి. ఇప్పడు మధ్యలో శశికళ వచ్చింది.
ఇటీవల పార్టీ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శిని తానే అని అందరూ ఒక్కటిగా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె చెప్పారు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలకు మరో నాలుగున్నరేళ్ల వరకూ సమయం ఉంది. ఇప్పుడే పార్టీలోకి వచ్చిన శశికళ ప్రత్యేకంగా చేసేదంటూ ఏమీ ఉండదు. కానీ వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శశికళ రీ ఎంట్రీ కేంద్రం పెద్దల అండదండలతోనే జరుగుతుందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో అధికారంలో ఉన్న కర్ణాటకకు తప్ప బీజేపీకి ఎక్కడా అవకాశం లేదు. తమిళనాడులో డీఎంకే బలంగా ఉంది. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలిసిందే. పన్నీరు సెల్వం, పళని స్వామిల మధ్య ఆధిపత్య పోరుతో బీజేపీకి అనుకున్న ఫలితం దక్కలేదు. దీంతో శశికళను రంగంలోకి దించారని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి.
మరోవైపు పన్నీర్ సెల్వం కూడా శశికళ వైపే చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ తిరిగి నిలదొక్కుకోవాలంటే ఆమె నాయకత్వం అవసరమని పన్నీర్ సెల్వం భావిస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుండా పళనిస్వామిని సైడ్ చేయాలన్నది సెల్వం ఆలోచనగా తెలుస్తోంది. మరి బీజేపీ రచిస్తున్న ఈ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో అన్నది వేచి చూడాలి.
This post was last modified on October 21, 2021 3:24 pm
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…