విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగా, ఆయన భార్య రత్నకుమారి ఇద్దరూ కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వంగవీటికి బెజవాడలోనే కాదు… తెలుగు గడ్డపై ప్రత్యేకమైన చరిత్రతో పాటు ఇమేజ్ ఉంది. ఆయన వారసుడిగా 26 ఏళ్ల వయస్సులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆయన తనయుడు వంగవీటి రాధా. 2004లో వైఎస్ ప్రాపకంతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచారు.
రాధాకు మంత్రి పదవి ఇస్తానని నాటి ముఖ్యమంత్రి వైఎస్ స్వయంగా హామీ ఇచ్చారు. అయితే 2009లో వేసిన రాంగ్ స్టెప్ రాధా పొలిటికల్ కెరీర్‌ను అధః పాతాళంలోకి తోసేసింది. కేవలం తన సామాజిక వర్గానికే చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతోనే ఆయన కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్తు కాలదన్నుకుని పార్టీ మారారు. ఆ ఎన్నికల్లో ఓడిన తర్వాత రాధాకు ఫ్యూచర్ అంతా చీకటి మయం అయ్యింది. తర్వాత చిరంజీవి కాంగ్రెస్లోకి వెళ్లడంతో రాధా వైసీపీలోకి వెళ్లారు.
2014లో రాధా మరోసారి రాంగ్‌స్టెప్ వేశారు. ఆయన మూడోసారి పార్టీ మారడం ఒక దెబ్బ అయితే… తనకు పట్టున్న సెంట్రల్ నియోజకవర్గం వదులుకుని తూర్పు నుంచి పోటీ చేసి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడారు. తర్వాత తూర్పు తనకు సెట్ కాదని… తిరిగి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా వచ్చారు. అయితే ఈ సారి జగన్ రాధాకు షాక్ ఇచ్చారు. సెంట్రల్ మల్లాది విష్ణుకు ఇస్తున్నానని.. నీకు అవనిగడ్డ అసెంబ్లీ లేదా బందరు ఎంపీ ఇస్తానని చెప్పారు.
ఇది అవమానంగా భావించిన రాధా గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే టీడీపీ ఓడిపోవడంతో ఇప్పుడు ఆయన పేరకు మాత్రమే టీడీపీలో ఉన్నా యాక్టివ్‌గా లేరు. వచ్చే ఎన్నికలలో టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో బెజవాడలో రాధా అనుచరులు, కాపు యువత ఆయన్ను జనసేనలోకి వెళ్లాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్టు స్థానికంగా ప్రచారం నడుస్తోంది. జనసేనలోకి వెళితే.. అది మన పార్టీ అని.. అక్కడ హవా ఎక్కువుగా ఉంటుందని చెపుతున్నారట.
రాధా టీడీపీలో ఉన్నా బాబు ఆయనకు లోటు చేయరు. అయితే టీడీపీ అనే మహాసముద్రం కంటే జనసేనలో చేరితే కమ్యూనిటీ పరంగా హైలెట్ అవ్వవచ్చని.. అక్కడ మంచి ఛాన్సులు ఉంటాయని రాధాపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయట. మరి రాధా డెసిషన్ ఏంటో ? చూడాలి.
This post was last modified on October 16, 2021 2:19 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…