వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెల్లిగా బీసీలను లాగటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. బీసీల ఆందోళనలకు తాను మద్దతు ఇస్తానని ఇపుడు చెబుతున్నారు. అయితే పవన్ ఉద్దేశ్యం మాత్రం 2024 ఎన్నికల నాటికి బీసీలను తన వైపు తిప్పకోవటమే అని అర్ధమవుతోంది. తనకు కులం లేదని పదే పదే చెబుతున్న పవన్ ఆచరణలో మాత్రం కాపులను ఓన్ చేసేందుకు ఇటీవల బాగా ప్రయత్నించారు.
2019 ఎన్నికల్లో పవన్ ఎంత ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. అందుకనే స్వయంగా పవన్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయారు. అప్పటి నుండి ఏ వేదికమీద మాట్లాడినా కాపులందరు ఐక్యంగా ఉండాలని పదే పదే చెబుతున్నారు. అయితే కాపుల్లో ఐక్యత ఉన్నంత మాత్రాన లాభం లేదని అర్థం చేస్తున్నట్లున్నారు. ఇదే సమయంలో కాపులంతా ఏక తాటిపైకి వచ్చేది కూడా అనుమానమే అని పవన్ కు అర్ధమైనట్లుంది.
అందుకనే హఠాత్తుగా రూటు మార్చిన పవన్ తాజాగా బీసీలంతా ఏకం కావాలంటు పిలుపిచ్చారు. హక్కుల కోసం ఉద్యమించే సమయంలో ఏకమవుతున్న బీసీలు ఎన్నికల సమయానికి ఎందుకు విడిపోతున్నానంటూ ప్రశ్నించారు. ఇక్కడ పవన్ మర్చిపోయిన విషయం ఒకటుంది. హక్కుల కోసం ఉద్యమాలు చేయటం వేరు రాజకీయ అధికారం కోసం ఉద్యమించడం వేరు. హక్కుల కోసం ఉద్యమాలు చేయటమంటే బీసీలంతా ఏకమైతే చాలు. కానీ రాజకీయ అధికారం అందుకోవాలంటే ఒక్క బీసీలు ఏకమైతే సరిపోదు. ఇతర సామాజికవర్గాల వారు కూడా మద్దతుగా నిలబడాలి. హక్కుల విషయంలో బీసీలంతా ఒకటిగా ఉండాలని చెప్పే నేతలు ఎన్నికల్లో ఇతర సామాజికవర్గాలను ఓట్లు వేయమని ఎలా అడగ్గలరు ? ఇక్కడే రాజకీయంగా సామాజిక వర్గాలు ఫెయిలవుతున్నాయి. హక్కుల కోసం పోరాటాలు వేరు, రాజకీయాధికారం అందుకోవటం వేరని జనాల్లో ఉన్న స్పష్టత కూడా పవన్ లో కనబడకపోవటమే విచిత్రంగా ఉంది.
ఏ పార్టీ అయినా లేకపోతే ఎంత పెద్ద నేత అయినా ఎన్నికల్లో గెలవాలంటే అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఓట్లేస్తేనే గెలుస్తారు. అంతేకానీ కేవలం ఒక సామాజికవర్గాన్ని మాత్రం నమ్ముకుంటే గెలుపు ఎప్పటికీ సాధ్యం కాదు. మహా అయితే మెజారిటీ పెరగడానికి మాత్రమే సదరు నేత సామాజిక వర్గం ఓట్లు పనిచేస్తాయంతే. 2019 ఎన్నికల్లో వైసీపీకి అఖండ మెజారిటీ దక్కిందంటే అందుకు అన్ని సామాజికవర్గాలు అండగా నిలబడటమే అని పవన్ మరచిపోయినట్లున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల నాటికి కాపులు హోలు మొత్తం మీద, బీసీలను కూడా తనకు మద్దతుగా లాక్కోవాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి కాలం ఏమి నిర్ణయిస్తుందో చూడాల్సిందే.
This post was last modified on October 13, 2021 11:02 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…