పశ్చిమగోదావరి జిల్లా. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కంచుకోట. 2014 ఎన్నికల్లో బీజేపీతో మిత్రత్వం ఉన్న కారణంగా.. ఇక్కడి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని.. ఆ పార్టీకి కేటాయించి.. మిగిలిన స్థానాల్లో టీడీపీ విజయబావుటా ఎగురవేసింది. అంతేకాదు.. అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులు విజయం దక్కించుకున్నారు.
ఇక, 2019 ఎన్నికల్లో.. వైసీపీ సునామీ.. జగన్ హవా నడిచినప్పటికీ.. పాలకొల్లు.. ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకుంది. అయితే.. జిల్లా ప్రధాన కేంద్రం.. ఏలూరులో బలమైన నాయకుడిగా ఉన్న బడేటి బుజ్జి.. పార్టీని నడిపించి.. బలోపేతం చేశారు. కానీ, గత ఎన్నికల తర్వాత.. ఆయన ఆకస్మిక మరణంతో పార్టీ ఇప్పుడు.. ఈ నియోజకవర్గం నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది.
వాస్తవానికి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్‌గా గన్ని వీరాంజనేయులు ఉన్నారు. పార్టీని నడిపిస్తున్నారు. అయితే.. ఏలూరుపై మాత్రం పట్టు సాధించలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. దీనికి కారణం.. మాగంటి బాబు అనుచరులు చాలా మంది మంత్రి ఆళ్ల నాని పక్షంలో చేరిపోయారు. దీనికితోడు.. ఆళ్ల నానికి పాజిటివ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆళ్ల నానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నా.. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ లభించడం లేదు. ఆయన పై ఎలాంటి వివాదాలూ లేకపోవడం.. ఆరోపణలు చేసే స్థాయిలో ఆయన రాజకీయాలు చేయకపోవడం.. గమనార్హం. పోనీ.. టీడీపీ తరఫున బలంగా ప్రజల్లోకి వెళ్తున్న నాయకులు కూడా కనిపించడం లేదు.
దీంతో ఏలూరు టీడీపీలో నైరాశ్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు మాజీ ఎంపీ మాగంటి బాబు హవా నడిచిందని చెప్పుకొన్నా.. కొన్ని కారణాలతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లోనే బలవంతంగా ఆయన పోటీ చేయాల్సి వచ్చింది. ఇక, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఏలూరులో బలమైన నాయకుడు.. టీడీపీలో కనిపించడం లేదని.. సొంతపార్టీ నాయకులే అంటున్నారు.ఈ విషయాన్ని ఇటీవల కొందరు నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినా.. ఆయన దీనిని సీరియస్‌గా తీసుకోకపోవడం.. గమనార్హం.
ప్రభుత్వ వ్యతిరేకత.. తమకు ప్లస్ అవుతుందని అనుకున్నా.. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకులు అవసరం అనే భావన వ్యక్తమవుతోంది. కానీ, ఆదిశగా పనిచేసే నేతలు లేక పోవడం.. చురుకైన పాత్ర పోషించే నేతలు కనిపించకపోవడం గమనార్హం. పైగా.. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా.. ఇప్పటి నుంచి ఎందుకులే అనుకునే వారు పెరుగుతున్నారు. ఈ పరిణామాలు.. టీడీపీ కంచుకోట .. జిల్లా అయిన.. ఏలూరులో వచ్చే ఎన్నికలలో అయినా.. ఆ పార్ట జెండా ఎగురుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితిని తీసుకువచ్చింది. ఇప్పటికిప్పుడు.. కీలక నేతలు.. కనిపించడం లేదని.. ఇప్పటికైనా.. పార్టీని పట్టించుకోవాలని ఇక్కడి తమ్ముళ్లు కోరుతుండడం గమనార్హం.
This post was last modified on October 7, 2021 10:17 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…