జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది అనేకన్నా వాళ్ళ రియాక్షన్ తో అనేక వివాదాలు పుట్టుకువస్తున్నాయి. సాధారణంగా ఇవి తరచు ఇతరులకు ఇబ్బంది కలిగించేవి. కానీ ఇపుడు అభిమానుల తీరు పవన్ కే ఇబ్బందిని కలిగించింది.
తాజాగా రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరైన పవన్ మాట్లాడటం మొదలుట్టడమే ఆలస్యం. వెంటనే సీఎం…సీఎం అంటు ఒకటే గోల. కాసేపు నిశ్శబ్దంగా ఉండమని తాను చెప్పేది వినమని పవన్ ఎంత బతిమలాడినా పట్టించుకోలేదు.
ఫ్యాన్స్ వైఖరితో విసిగిపోయిన పవన్ చివరకు చిరాకెత్తి గట్టిగా అరిచేశారు. సీఎం..సీఎం అనే కేకలు విని తాను చాలా అలసిపోయినట్లు మండిపడ్డారు. తన బహిరంగ సభలకు హాజరైన అభిమానులు కూడా పోయిన ఎన్నికల్లో వైసీపీకే ఓట్లేసిన విషయాన్ని గుర్తుచేశారు. తన సభలో కేకలు వేసే అభిమానులు పోలింగ్ లో ఓట్లు మాత్రం వైసీపీకి వేశారని ఈమధ్యనే నేతల విస్తృతస్ధాయి సమావేశంలో కూడా మండిపడిన విషయం అందరు చూసిందే.
సీఎం అనేది తాను ముఖ్యమంత్రి అయినపుడు అరవండి కానీ అప్పటివరకు ఎవరు అలా అరవద్దంటు ఫ్యాన్స్ కు పెద్ద క్లాస్ పీకారు. తన సభల్లో ఎక్కడా ఇకనుండి తాను సీఎం అనే మాట వినబడకూడదంటు ఆంక్షలు విధించారంటేనే ఫ్యాన్స్ తో పవన్ ఎంత విసిగిపోయారో అర్ధమవుతోంది. తాను సీఎం అవ్వాలని నిజంగానే అభిమానులు కోరుకుంటే ఆ పనిని ఎన్నికల్లో ఓట్లేసి చూపించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
This post was last modified on October 3, 2021 10:48 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…