ఇపుడీ విషయం రెండు పార్టీల్లో ఆసక్తిగా తయారైంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఇటు బీజేపీ అటు జనసేన రెండు పోటీకి సై అంటే సై అన్నాయి. అసలు బలమే లేని నియోజకవకర్గంలో తామే పోటీచేయాలంటే కాదు తామే పోటీలో ఉంటామంటూ కొద్దిరోజులు రెండు పార్టీల నేతల మధ్య పెద్ద వివాదమే నడిచింది. సరే మొత్తానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎలాగోలా ఒప్పించి కమలం పార్టీయే పోటీ చేసింది. బీజేపీ అభ్యర్థిగా ఐఏఎస్ మాజీ అధికారి, కర్ణాటక చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన రత్నప్రభ పోటీ చేశారు.
తిరుపతి నియోజకవర్గం పరిధిలో లేకపోతే రాష్ట్రంలోనే గట్టి నేతలు ఎవరు లేనట్లు కర్నాటక నుంచి రత్నప్రభను దిగుమతి చేసుకున్నారు. ఆమె కూడా ఎన్నికల ముందు ఎంత స్పీడుగా వచ్చారో పోలింగ్ అయిపోగానే అంతే స్పీడుగా రివర్సయిపోయారు. చివరకు కౌటింగ్ లో చూస్తే బీజేపీ అభ్యర్థి కి డిపాజిట్ కూడా రాలేదు. రత్నప్రభకు ఎన్నికల ప్రచారంలో పవన్ ఒకసారి రోడ్ షో చేశారు. అదే సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారంతే. ఎన్నికల ప్రచారంలో మళ్ళీ పవన్ ఎక్కడా కనబడలేదు.
సీన్ కట్ చేస్తే ఇపుడు బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతోంది. మరి ఈ ఎన్నికలో మిత్రపక్షాల్లో ఎవరు పోటీ చేస్తారు ? తిరుపతి లోక్ సభలో బీజేపీ పోటీ చేసింది కాబట్టి బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలంటు జనసేన నుండి డిమాండ్లు మొదలైపోయాయి. నిజానికి ఇక్కడ కూడా రెండు పార్టీలకు ఏ మాత్రం బలం లేదు. పోటీ చేయటం పక్కన పెడితే పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను పెట్టుకునేంత సీన్ కూడా రెండు పార్టీలకు లేదు.
ఇక 2019 ఎన్నికల విషయాన్ని తీసుకుంటే వైసీపీ తరుపున డాక్టర్ గుంతోటి వెంకటసుబ్బయ్య పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేశారు. 2.04 లక్షలున్న ఈ ఎస్సీ నియోజకవర్గంలో 1,50,621 ఓట్లు పోలయ్యాయి. వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లు రాగా రాజశేఖర్ కు 50748 ఓట్లొచ్చాయి. అంటే వైసీపీ అభ్యర్థి 44,734 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఏడాది మార్చిలో వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
వైసీపీ తరఫున ఆయన భార్య డాక్టర్ సుధ పోటీ చేయబోతున్నారు. టీడీపీ తరఫున మళ్ళీ ఓబుళాపురమే పోటీ చేస్తున్నారు. కాబట్టి మిత్రపక్షాల్లో ఏ పార్టీ పోటీ చేయబోతోంది ? ఎవరు పోటీలో ఉండబోతున్నారనేది ఆసక్తిగా మారింది. నిజానికి ఇక్కడ బలం లేకపోయినా టీడీపీ పోటీలోకి దిగుతోంది. అలాంటిది ఇక మిత్రపక్షాల గురించి ఎంత తక్కువ చెప్పుకన్నా ఎక్కువగానే ఉంటుంది.
This post was last modified on September 29, 2021 6:44 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…