Political News

ఆ ఇద్ద‌రి గేమ్‌లో పెయిడ్ ఆర్టిస్ట్‌గా పోసాని.. అచ్చెన్న బిగ్ బాంబ్‌


కొద్ది రోజులుగా ఏపీ రాజ‌కీయాలు అధికార‌, ప్ర‌తిప‌క్ష నేతల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో హీటెక్కుతున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం ఆ వెంట‌నే వైసీపీకి చెందిన మంత్రులు, నేత‌ల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన పోసాని కృష్ణ ముర‌ళీ లాంటి వాళ్లు ప‌వ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం జ‌రిగింది. ఇక ఈ వివాదంలో వైసీపీ వాళ్లు ప‌వ‌న్‌కు – చంద్ర‌బాబుకు లింకు పెట్టి కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో టీడీపీ నేత‌లు కూడా వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ తాజా వివాదంపై ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు సైతం స్పందించారు. సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్ పోసాని అని ఆయ‌న తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పోసాని బూతులు వింటుంటే స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. అత్యంత జుగుస్సాక‌ర‌మైన భాష‌ను వాడుతూ పోసాని తెలుగుజాతి సంస్కృతినే మంట‌గ‌లుపుతున్నార‌ని విమ‌ర్శించారు. పీకే ఆడే వికృత ఆట‌లో పోసాని పావుగా మారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై నీచ‌మైన భాష వాడుతూ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని… పీకే టీం ఆడిస్తోన్న ఈ వికృత ఆట చూస్తోన్న జ‌గ‌న్ పోసానిని ఎందుకు ? నిలువ‌రించలేక‌పోయార‌ని అచ్చెన్న ప్ర‌శ్నించారు.

తాగుబోతులు కూడా ఇలా మాట్లాడ‌ర‌ని అచ్చెన్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో రాష్ట్రం డ్ర‌గ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింద‌న్నారు. ధ‌ర‌లు పెంచ‌డం, దోపిడీల‌కు పాల్ప‌డ‌డం లాంటి చ‌ర్య‌ల‌తో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్రంగా ఉన్న వ్య‌తిరేక‌త‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని అచ్చెన్న మండిప‌డ్డారు. పీకే డైరెక్ష‌న్‌లోనే వైసీపీ నేత‌లు ఏపీలో కుల‌, మ‌త ప్రాంతీయ త‌త్వాల‌ను రెచ్చ‌గొట్టి ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని మంట‌గ‌లుపుతున్నార‌ని.. వీరికి ఖచ్చితంగా ఏపీ ప్ర‌జ‌లు త్వ‌ర‌లోనే గుణ‌పాఠం చెపుతున్నార‌ని అచ్చెన్న జోస్యం చెప్పారు.

ఏదేమైనా అచ్చెన్న ఘాటైన వ్యాఖ్య‌లు చూస్తే జ‌న‌సేనకు, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు కాస్త బూస్ట‌ప్ ఇచ్చేలా ఉన్నాయి. ఇవి ఈ రెండు పార్టీల మ‌ధ్య ఓ స‌హృధ్భావ వాతావ‌ర‌ణానికి బీజం ప‌డేలా చేశాయ‌న్న టాక్ వ‌స్తోంది.

This post was last modified on September 29, 2021 5:45 pm

Share
Show comments

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

18 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

57 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago